twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కల్యాణ్ లెక్క, తిక్క చూపించిన 'గబ్బర్ సింగ్'కు 10 ఏళ్లు.. ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరు ఒక సంచలనం. సుమారు పదేళ్ల పాటు ఒక్క హిట్ సినిమా కూడా లేదు, చేస్తున్న ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూనే ఉంది. వచ్చింది వచ్చినట్లు వెళ్ళిపోతే ఉంది కానీ ఒక్క హిట్ కూడా పడలేదు. పవన్ కళ్యాణ్ కూడా రకరకాల సినిమాలు చేస్తూ ఏదో ఒక హిట్టు దొరకకపోతుందా అని ఎదురు చూశారు. మధ్యలో జల్సా లాంటి సినిమా వచ్చింది కానీ అది ఫాన్స్ ఆకలి తీర్చే హిట్ మాత్రం కాదు.. ఒకరకంగా అప్పట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇతర హీరోల ఫ్యాన్స్ ముందు తలెత్తుకోలేకపోయారు.. సరిగ్గా అదే సమయంలో వచ్చింది గబ్బర్ సింగ్ సినిమా. ఈ సినిమా వచ్చి అప్పుడే 10 ఏళ్ళు అవుతుంది అంటే ఆశ్చర్యం కలుగక మానదు. సరిగ్గా మే 11 2012 వ సంవత్సరంలో విడుదలైన గబ్బర్ సింగ్ సినిమా మొదటి ఆట నుంచే అద్భుతమైన టాక్ తెచ్చుకుని బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.

    కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు, మార్కెట్లో అతని ఫాలోయింగ్ చూస్తే మెంటల్ ఎక్కుతుంది, నేను ట్రెండ్ ఫాలో అవ్వను ట్రెండ్ సెట్ చేస్తా అంటూ పవన్ మార్క్ డైలాగులు అసలు పవన్ కోసమే రాశారా అన్నట్టు ఎంతో బాగా కుదిరాయి. సుమారు 12 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు పవన్ కళ్యాణ్. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అన్న విధంగా ఈ సినిమా దెబ్బకు మిగతా సినిమాలు తప్పుకున్నాయి. ఆ రోజుల్లోనే ఈ సినిమా 69 కోట్ల రూపాయలు వసూలు చేసింది అంటే పవన్ ఇమేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమాలో ప్రతి అంశం అప్పట్లో హైలెట్ అయింది అంత్యాక్షరి ఎపిసోడ్ కబడ్డీ ఫైటింగ్ దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్, బ్రహ్మానందం కామెడీ హారతి ట్రాక్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా, సినిమా మొత్తం హైలెట్స్ ఉంటాయి. ఈ సినిమా వచ్చి పదేళ్లు అవుతున్నా ఇంకా దాని క్రేజ్ తగ్గలేదు అంటే అర్థం చేసుకోవచ్చు.

    Power Star Pawan Kalyan starrer Gabbar Singh completed 10 years of its release.

    హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన దబాంగ్ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టు స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసి హరీష్ శంకర్ పవన్ అభిమానులకు ఒక అద్భుతమైన విజయాన్ని అందించారు. అయితే ఈ సినిమా తొలుత నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ లో చేయాలనుకున్నారు కానీ అప్పటికే ఆరెంజ్ సినిమాతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయనతో కాకుండా తీన్మార్ సినిమా చేసి డబ్బులు పోగొట్టుకున్న బండ్ల గణేష్ తో చేయాలని నిర్ణయించుకున్నారు. అలా తెరకెక్కి విడుదలైన ఈ సినిమా 306 కేంద్రాల్లో 50 రోజులకు పైగా ఆడింది, అలాగే 65 కేంద్రాలలో 100 రోజులు ఆడి అద్భుతమైన విజయం సాధించింది. 35 కోట్ల రూపాయల బిజినెస్ చేసిన సినిమా దాదాపు పాతిక కోట్ల రూపాయలు ఆ రోజుల్లోనే లాభాలు తీసుకువచ్చింది. ఈ దెబ్బతో పవన్ మార్కెట్ పెరగడమే కాక బండ్ల గణేష్ కూడా సక్సెస్ ఫుల్ నిర్మాతగా నిలబడ్డాడు. హరీష్ శంకర్ కి కూడా దర్శకుడిగా క్రేజ్ పెరిగిపోయింది.

    English summary
    Power Star Pawan Kalyan starrer Gabbar Singh completed 10 years of its release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X