»   » ‘పిఎస్‌వి గరుడవేగ’ కలెక్షన్స్ దూకుడు: రాజశేఖర్ తర్వాతే నాగార్జున, రామ్!

‘పిఎస్‌వి గరుడవేగ’ కలెక్షన్స్ దూకుడు: రాజశేఖర్ తర్వాతే నాగార్జున, రామ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన 'పిఎస్‌వి గరుడవేగ' మూవీ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు... అమెరికాలో కూడా ఈ చిత్రం వసూళ్లు సంతృప్తికరంగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన సినిమాలను వెనక్కి నెట్టేసుకుంటూ ఈ చిత్రం టాప్ పొజిషన్‌కు దూసుకెలుతోంది.

ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద 'పిఎస్‌వి గరుడవేగ' సినిమాకు ఎదురు లేదు. ఇంతకు మించిన హిట్ సినిమాలు రేసులో లేక పోవడం, ఆల్రెడీ ఉన్న సినిమాలకు అంతగా ఆదరణ లేక పోవడం గరుడ‌వేగ చిత్రానికి కలిసి వస్తోంది.

"PSV Garuda Vega" 5 Days Collections కోట్లు కురిపిస్తుంది
‘రాజుగారి గది 2’ చిత్రాన్ని వెనక్కి నెట్టేసి

‘రాజుగారి గది 2’ చిత్రాన్ని వెనక్కి నెట్టేసి

యూఎస్ బాక్సాఫీసు వద్ద పరిస్థితి గమనిస్తే..... నాగార్జున, సమంత ముఖ్య పాత్రల్లో నటించిన ‘రాజుగారి గది 2' మూవీ యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద $315,003 వసూలు చేసింది. అయితే పిఎస్‌వి గరుడవేగ మూవీ $341,027 వసూలు చేసి ఆ చిత్రాన్ని వెనక్కి నెట్టింది.

రామ్ ఉన్నది ఒక్కటే జిందగీని కూడా...

రామ్ ఉన్నది ఒక్కటే జిందగీని కూడా...

రామ్ నటించిన ‘ఉన్నది ఒక్కటే జిందగీ' మూవీ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద $313,764 మాత్రమే వసూలు చేసింది. ఈ నెంబర్‌ను పిఎస్‌వి గరుడవేగ మూవీ ఎప్పుడో క్రాస్ చేసింది.

నెక్ట్స్ టార్గెట్ రవితేజ

నెక్ట్స్ టార్గెట్ రవితేజ

‘పిఎస్‌వి గరుడవేగ' మూవీ నెక్ట్స్ టార్గెట్ రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్' మూవీ. ఈ చిత్రం యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద $369,823 వసూలు చేసింది. ప్రస్తుతం $341,027 నెంబర్ వద్ద ఉన్న ‘పిఎస్‌వి గరుడవేగ త్వరలోనే దీన్ని అధిగమిస్తుందని అంచనా వేస్తున్నారు.

రాజశేఖర్ హయ్యెస్ట్ గ్రాస్

రాజశేఖర్ హయ్యెస్ట్ గ్రాస్

‘పిఎస్‌వి గరుడవేగ' మూవీ రాజశేఖర్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం తొలి 5 రోజుల్లోనే రూ. 15 కోట్లకు పైగా వసూలు చేసింది. ఫుల్ రన్‌లో ఈ చిత్రం నిర్మాతలు మంచి లాభాలు తెచ్చి పెడుతుందని అంచనా వేస్తున్నారు.

యూఎస్ఏలో క్రింది ఏరియాల్లో స్కీన్లు పెంచారు

యూఎస్ఏలో క్రింది ఏరియాల్లో స్కీన్లు పెంచారు

AL - హంట్స్ విల్లే
FL - టంపా
FL - ఓర్లాండో
IN - ఇండియానా పోలిస్
NY - రోచెస్టర్
OK - ఓక్లహామా సిటీ
TX - ఫ్లుగెర్ విల్లే
UT - వెస్ట్ జోర్డాన్

English summary
Garuda Vega is all set to become the all time highest grossing movie in Dr. Rajasekhar’s career. According to the latest update, Garuda Vega has crushed the collection record of Akkineni Nagarjuna, Samantha and Seerat Kapoor starrer Raju Gari Gadhi 2 and Ram Pothineni’s romantic entertainer Vunnadhi Okate Zindagi with in 6 days.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu