»   » ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వల్ల నిర్మాతలకు ఎంత మిగిలిందో తెలుసా?

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వల్ల నిర్మాతలకు ఎంత మిగిలిందో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ బాక్సాఫీసు మరోసారి తన స్టామినా ఏమిటో చూపించారు. బాలయ్య హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన చారిత్రక చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.

వాస్తవానికి ఈ సినిమా ఊహించిన దానికంటే మంచి లాభాలు తెచ్చిపెట్టింది. సినిమా 50 రోజుల పూర్తయిన తర్వాత ట్రేడ్ అనలిస్టుల అంచనాల లెక్కలన్నీ తప్పని తేలిపోయింది. బాలయ్య కెరీర్లోనే ఈ చిత్రం భారీ లాభాలు తెచ్చిన సినిమాగా నిలిచింది.

అప్పట్లో ఈ సినిమా రూ. 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిందని తప్పుడు ప్రచారం జరిగంది. అయితే అవాస్తవమని తాజాగా తేలింది. ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్, లాభాలు క్రింది విధంగా ఉన్నాయి.

ఎంతలో సినిమాను పూర్తి చేసారు?

ఎంతలో సినిమాను పూర్తి చేసారు?

దర్శకుడు క్రిష్ ఈ సినిమా బడ్జెట్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారని, సినిమా మొత్తాన్ని రూ. 55 కోట్లలో పూర్తి చేసారట. బడ్జెట్ విషయంలో క్రిష్ ఎంత పొదుపు పాటించారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

సినిమాకు మొత్తం ఎంత రాబట్టింది

సినిమాకు మొత్తం ఎంత రాబట్టింది

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా మొత్తం థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో, డివిడి, డిజిటల్ రైట్స్ అన్ని కలిపి మొత్తం రూ. 77 కోట్లు నిర్మాతకు తిరిగి వచ్చాయని తెలుస్తోంది.

చిత్ర యూనిట్ ప్రకటన

చిత్ర యూనిట్ ప్రకటన

బాలయ్య కెరీర్ లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డ్ కెక్కిన ఈ సినిమా ఇప్పటి వరకూ రూ.77 కోట్లను వసూలు చేసింది అని చిత్ర యూనిట్ ప్రకటించారు.

పూరి, బాలయ్య

పూరి, బాలయ్య

నందమూరి బాలకృష్ణతో తొలిసారి సినిమా చేసే అవకాశం దక్కించుకున్న పూరి జగన్నాథ్‌.... ఇతర సినిమాల్లోనే ఈ సినిమా విషయంలోనూ ప్రయోగాలకు పూనుకున్నాడు. సినిమాలో ప్రధాన తారాగణం మొత్తం కూడా ఇప్పటి వరకు సినిమాల్లో నటించని కొత్తవారితో నింపేయబోతున్నారు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
'Gautamiputra Satakarni' producers pocked as much as Rs 77 crore through the sale of Theatrical Rights, Satellite Rights, Audio/DVD/Digital and Other Rights. Director Krish cpmplete this movie just Rs 55 crore Budget.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu