twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిజమా? : 'గోవిందుడు...' నైజాంలో అంత లాస్

    By Srikanya
    |

    హైదరాబాద్ : కృష్ణవంశీ సినిమా అంటే.. ఇంటిల్లిపాదీ చూడాల్సిందే. కుటుంబ కథా చిత్రాలకు కొత్త ఒరవడి తీసుకొచ్చిన కృష్ణవంశీకి కొంతకాలంగా హిట్‌ లేదు. ఇప్పుడాయన 'గోవిందుడు అందరివాడేలే' సినిమాతో వచ్చారు. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉండటంతో బిజినెస్ బాగా జరుగింది. అయితే సినిమా మార్నింగ్ షో నుంచి యావరేజ్ టాక్ రావటంతో ఎక్కువ రేట్లు కు పెట్టి కొన్నవారు నష్టపోవటం ఖాయమని ట్రేడ్ వర్గాల్లో వినపడుతోంది. తాజాగా నైజాంలోనూ లాస్ వచ్చే అవకాసం ఉందని అంటున్నారు.

    నైజాం ఏరియా ఈ చిత్రం రైట్స్ ని దిల్ రాజు తీసుకున్నారు. 12 కోట్లకు ఈ చిత్రం నైజాం రైట్స్ తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు వరకూ బ్రేక్ ఈవెన్ రాలేదని కేవలం 8 కోట్లు మాత్రమే వసూలయ్యిందని, 4 కోట్లు లాస్ వస్తుందని లెక్కలు వేస్తున్నారు. అయితే ఇదే కరెక్టు సమాచారం అని చెప్పలేము. ఇది కేవలం ట్రేడ్ లో వినపడుతున్న టాక్ మాత్రమే.

    చిత్రం కథలో ...లండన్‌లో పుట్టి పెరిగి అక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు అలవాటు పడిన అభిరామ్ అనే యువకుడు తన మూలాల్ని వెతుక్కుంటూ ఓ అందమైన తెలుగు పల్లెకు వస్తాడు. అక్కడ అతను సరికొత్త జీవితాన్ని దర్శిస్తాడు. పల్లె అప్యాయతలు, అనుబంధాలకు ముగ్ధుడవుతాడు. అభిరామ్ అందరివాడనిపించుకుంటాడు. విడిపోయిన తన కుటుంబాన్ని కలుపుతాడు. తన తాతని, తండ్రిని, బాబాయిని ఏకం చేస్తాడు. ఈ క్రమంలో జరిగే భావోద్వేగభరిత సంఘటనల సమాహారమే గోవిందుడు అందరివాడేలే చిత్ర ఇతివృత్తం.

    GAV ends up with loss in Nizam area

    ఆయన దర్శకత్వంలో రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మించారు. శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ ముఖ్య పాత్రల్ని పోషించారు. అయితే కామెడీ పెద్దగా లేకపోవటం, ఆడియో కూడా పెద్ద ఆదరణ పొందకపోవటం ఈ చిత్రం విజయానికి ప్రధాన అడ్డంకిగా మారాయి.

    ప్రకాష్‌రాజ్, జయసుధ, ఎం.ఎస్.నారాయణ, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు, పోసాని తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: యువన్‌శంకర్‌రాజా, ఆర్ట్: అశోక్‌కుమార్, ఎడిటింగ్: నవీన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, రామ్‌లక్ష్మణ్, రచన: పరుచూరి బ్రదర్స్, దర్శకత్వం: కృష్ణవంశీ.

    English summary
    ‘Govindudu Andari Vaadele’ Film collected Rs.8crs in Nizam area. But it is known that Dil Raju bought the rights for 12cr. So he may end up with Rs.4crs loss.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X