దిమ్మతిరిగేలా గీత గోవిందం కలెక్షన్లు.. అమెరికాలో రికార్డు వసూళ్లు!

By Rajababu

విజయ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన గీత గోవిందం చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లను సాధిస్తున్నది. ఆగస్టు 15న రిలీజైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లో దుమ్మురేపుతున్నది. దక్షిణాదిలో ఎడతెరపని వర్షాలను సైతం పక్కన పెట్టి ఈ చిత్రం భారీ కలెక్షన్లను సాధించడంపై ట్రేడ్ వర్గాలు నివ్వెరపాటుకు గురవుతున్నారు. గత మూడు రోజుల్లో గీత గోవిందం రూ.19 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఇవే..

మిలియన్ డాలర్ల క్లబ్‌లో

మిలియన్ డాలర్ల క్లబ్‌లో

ఓవర్సీస్ మార్కెట్‌లో గీత గోవిందం చిత్రానికి మంచి స్పందన వ్యక్తమవుతున్నది. శనివారం కల్లా ఈ చిత్రం 1 మిలియన్ మార్క్‌ను చేరుకొనే అవకాశం ఉంది. అంటే దాదాపు రూ.6 కోట్లకుపైగా వసూళ్లు సాధించనున్నది.

యూఎస్‌లో భారీగా కలెక్షన్లు

ఆగస్టు 15న రిలీజైన ఈ చిత్రం మొదటి రోజున 4 లక్షల డాలర్లు, రెండో రోజున 198,329 డాలర్లు, మూడో రోజున 132,294 డాలర్లతో మొత్తం 731,294 డాలర్లు (5.12 కోట్లు) వసూలు చేసింది. శుక్రవారం లేదా, శనివారం మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో

తెలుగు రాష్ట్రాల్లో

తెలుగు రాష్ట్రాల్లో కూడా గీత గోవిందం కనకవర్షం కురిపిస్తున్నది. గత మూడు రోజుల్లో నైజాంలో 5.01 కోట్ల షేర్ సాధించడం గమనార్హం. ఇక ఆంధ్రా ప్రాంతంలోని వైజాగ్‌లో 1.34 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.01 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 1.09 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ. 97 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.1.04 కోట్లు, గుంటూరులో రూ.1.29 కోట్లు వసూలు చేసింది. నెల్లూరులో రూ. 44 లక్షల కలెక్షన్లను ఈ చిత్రం నమోదు చేసింది.

Recommended Video

Geetha Govindam Second Day Collections
 ఇతర రాష్ట్రాల్లో

ఇతర రాష్ట్రాల్లో

ఇతర రాష్ట్రాల్లో కర్ణాటక రూ. 1.64 కోట్లు, తమిళనాడులో రూ. 1.87 గ్రాస్ కలెక్షన్లు సాధించింది. కేరళలో వర్షాల కారణంగా ఈ సినిమాకు స్పందన వ్యక్తం కాలేదు. భారీ వర్షాలు లేకుంటే దక్షిణాదిలో పెద్త మొత్తంలో కలెక్షన్లు వచ్చేవని చెప్పుకొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X