»   » రభస' ని అడ్డం పెట్టి అమ్ముతున్నారు

రభస' ని అడ్డం పెట్టి అమ్ముతున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :నిర్మాత బెల్లంకొండ సురేష్‌ తనయుడు శ్రీనివాస్‌ హీరోగా వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అల్లుడు శ్రీను'. సమంత హీరోయిన్. బెల్లంకొండ సురేష్‌ సమర్పకుడు. శ్రీలక్ష్మీ నరసింహా ప్రొడక్షన్‌‌స పతాకంపై బెల్లంకొండ గణేష్‌ నిర్మిస్తున్నాడు. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ చిత్రం ఆడియో, టీజర్స్ విడుదలై బిజినెస్ పరంగా మంచి క్రేజ్ తెచ్చింది. అయితే బెల్లంకొండ సురేష్ మాత్రం తన రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారానే ఈ చిత్రం అమ్మబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బాగానే అడ్వాన్స్ లు వచ్చినట్లు ట్రేడ్ లో చెప్తున్నారు. వినాయిక్, సమంత, తమన్నా సెల్లింగ్ పాయింట్స్ గా చెప్తున్నారు. అలాగే రభస చిత్రం కూడా బెల్లంకొడ దే కావటం కూడా ఈ సినిమా బిజినెస్ కు ప్లస్ అవుతోంది. రభస ని ఈ చిత్రానికి ఇన్సూరెన్స్ గా భావించి బిజనెస్ జరుగుతోందని అంటున్నారు.

బ్రహ్మానందం, శ్రీనివాస్ మధ్యలో వచ్చే అనేక సన్నివేశాల నేపథ్యంలో ఈ టైటిల్ అనేకసార్లు వినిపిస్తుండడంవల్ల ఈ చిత్రానికి ఇదే సరైన పేరని నిర్ణయించుకున్నామని తెలిపారు. సినిమా మొదటినుండి చాలా సరదా సరదాగా సాగుతూ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా విందు భోజనం అందిస్తుందని, ఈ చిత్రంలో తమన్నా చేసిన పాట హైలెట్‌గా ఉండనుందని ఆయన అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దుతున్న ఈ చిత్రం తప్పక విజయవంతం అవుతుందని, ప్రతీ సన్నివేశం కూడా ప్రేక్షకులు ఆనందించేలా ఉంటుందని, కొత్త హీరో అయినా కానీ సినిమా అగ్ర స్థాయి హీరో చిత్రంలా సాగుతూ ప్రేక్షకులను అలరిస్తుందని తెలిపారు.

Good Business for Alludu Seenu

ఏడు సంవత్సరాలుగా హీరో శ్రీనివాస్ అన్ని రకాల శిక్షణలు తీసుకుని ఓ మంచి దర్శకుడు దగ్గర ఈ చిత్రాన్ని చేస్తుండడం సంతోషంగా ఉందని, ఓ రకంగా అతని అదృష్టంగా తాను భావిస్తున్నానని నిర్మాత బెల్లకొండ సురేష్ తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ చిత్రాన్ని జూలై 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన వివరించారు.

ప్రకాష్‌రాజ్, తనికెళ్ల భరణి, రఘుబాబు, వెన్నెల కిశోర్, వేణు, ఫణి, ఫిష్ వెంకట్, పృధ్వి, జెన్ని, ప్రదీప్ రావత్, రవిబాబు, భరత్, ప్రవీణ్, ఆనంద్ భారతి, గుండు సుదర్శన్, అనంత్, అమిత్, నవీన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు:కోన వెంకట్, రచన:గోపిమోహన్, కథ:కె.ఎస్.రవీంద్రనాధ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, స్టన్ శివ, రవివర్మ, వెంకట్, పాటలు:చంద్రబోస్, రామజోగయ్యశాస్ర్తీ, భాస్కరభట్ల, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, సంగీతం:దేవిశ్రీ ప్రసాద్, కెమెరా:ఛోటా కె.నాయుడు, సమర్పణ:బెల్లకొండ సురేష్, నిర్మాత:బెల్లంకొండ గణేష్‌బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:వి.వి.వినాయక్.

English summary
Producer Bellamkonda 
 is releasing Alludu Seenu himself through his Regular Distributors who are agreeing for some Big Advances. The Upcoming release of Rabhasa is their insurance probably.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu