»   » నష్టమా? : ‘గోపాల గోపాల’ క్లోజింగ్ బిజినెస్ (ఏరియావైజ్)

నష్టమా? : ‘గోపాల గోపాల’ క్లోజింగ్ బిజినెస్ (ఏరియావైజ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వెంకటేశ్‌, పవన్‌కల్యాణ్‌ మొదటిసారి కలిసి నటించిన ‘గోపాల గోపాల' . ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా క్రితం నెల (జనవరి 10వ తేదీ) విడుదలయ్యి పాజిటివ్ టాక్ తెచ్చకుంది. సురేశ్‌ ప్రొడక్షన్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై సురేశ్‌, శరత్‌మరార్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కిశోర్‌కుమార్‌ పార్దసాని దర్శకుడు. వెంకటేశ్‌ జోడీగా శ్రియ నటించింది. హిందీలో ఘన విజయం సాధించిన ‘ఓ మై గాడ్‌'కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలతో విడుదలైంది. అయితే దురదృష్టవశాత్తు రకరకాల కారణాలతో యావరేజ్ కారణాలతో నిలిచింది. క్లాస్ ఏరియాల్లో బాగానే ఉన్నా...మాస్ సెంటర్లలో అసలు వర్కవుట్ కాకపోవటంతో డిస్ట్రిబ్యూటర్స్ కు నష్టం మిగిల్చిందని చెప్తున్నారు. 42.35 కోట్ల రూపాయలు క్లోజింగ్ బిజినెస్ గా వచ్చింది.

Gopala Gopala business closed with deficit

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఏరియా కలెక్షన్స్ (షేర్


నైజాం: 11.41 కోట్లు


సీడెడ్ : 5.35 కోట్లు


ఉత్తరాంధ్ర: 4.59 కోట్లు


తూర్పు గోదావరి: 3.58 కోట్లు


పశ్చిమ గోదావరి: 2.64 కోట్లు


కృష్ణా : 2.49 కోట్లు


గుంటూరు: 3.19 కోట్లు


నెల్లూరు : 1.41 కోట్లు


మొత్తం ఎపి+నైజాం : 34.66 కోట్లు


కర్ణాటక :2.52 కోట్లు


ఇండియాలో మిగిలిన ప్రాంతాలు :0.95 కోట్లు


ఓవర్ సీస్ : 4.22 కోట్లు


మొత్తం (ప్రపంచవ్యాప్తంగా) రూ 42.35 కోట్లుగమనిక: ఇవన్నీ ట్రేడ్ లో చెప్పబడుతున్న లెక్కలు మాత్రమే...అఫీషియల్ ధృవీకరించి విడుదల చేసినవి మాత్రం కాదు


చిత్రం కథేమిటంటే...


దేవుడంటే నమ్మకం లేని నాస్తికుడైన గోపాల రావు(వెంకటేష్) ... దేముడి బొమ్మల దుకాణం నడుపుతుంటాడు. మాట్లాడితే దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే అతడి దుకాణం భూకంపం దాటికి నేలకూలిపోతుంది. ఇన్సూరెన్స్ కోసం వెళితే యాక్ట్ ఆఫ్ గాడ్ (ప్రకృతి వైపరిత్యాల) క్రింద దాన్ని పరిగణించి, అది దేముడి తప్పిందం చెప్తూ పైసా కూడా ఇవ్వలేమని కంపెనీ వారు చెప్తారు. ఈ నేపధ్యంలో ఏమీ చేయలేని పరిస్ధితుల్లో గోపాల రావు ఆ గాడ్(దేముడి) తన నష్టానికి బాధ్యుడు కాబట్టి ఆయన మీదే కేసు వేస్తాడు. దేముడుకి వ్యతిరేకంగా వాదించటానికి ఏ లాయిరూ ముందుకు రాకపోయేసరికి గోపాలరావు స్వయంగా తానే వాదించుకోవటం మొదలెడతాడు. దేముడు ప్రతినిధులుగా చెప్పబడే స్వామీజీలను, మఠాథిపతులను, బాబాలను కోర్టుకు లాగుతాడు.


దైవమో, లేక ఆయన అనుచరులుగా చెప్పుకుంటున్న మతగురువులో ఎవరో ఒకరు తనకు నష్టపరిహారం చెల్లించాలని న్యాయదేవత ముందు గగ్గోలు పెడతాడు. దాంతో గోపాల రావుకు వ్యతిరేకంగా నిరసనలు చుట్టముడతాయి. దేముడుకు వ్యతిరేకంగా వెళ్లతావా అంటూ అతని బార్య(శ్రియ) అతన్ని వదిలేసి వెళ్లిపోతుంది...అంతా అతన్ని ఒంటిరివాడిని చేస్తారు. మరో ప్రక్క తాము కోర్టుకు లాగబడటంతో అందులో దొంగ స్వామీజిలకు కోపం వచ్చి(పోసాని, మిధున్ చక్రవర్తి) భౌతిక దాడులతో అతన్ని అడ్డు తప్పించాలనుకుంటారు. అప్పుడు భగవంతుడు గోపాలుడే(పవన్ కళ్యాణ్) రంగంలోకి దిగి గోపాలరావుని ఆ సమస్యల నుంచి ఒడ్డెంక్కించే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో ఏం జరిగింది. ఏ విధంగా ఆ గోపాలుడు...ఈ గోపాలరావుని ఆదుకున్నాడు అనేది మిగతా కథ.


ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం. మిగతా ముఖ్య పాత్రల్లో.. మిధున్‌చక్రవర్తి, పోసాని, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్‌, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్‌, పృథ్వి, దీక్షాపంత్‌, నర్రా శీను తదితరులు నటించారు.

English summary
Pawan Kalyan and Venkatesh starrer satirical drama Gopala Gopala has collected a share of Rs 42.35 Crores worldwide for full run.Here is Gopala Gopala Area Wise Break Up List:
Please Wait while comments are loading...