twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాఫీస్: 'గోపాల గోపాల' 40 కోట్లు, 'ఐ' 100 కోట్లు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పండగ సీజన్లో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. సంక్రాంతికి విడుదలైన పవన్ కళ్యాణ్-వెంకటేష్ మల్టీస్టారర్ తెలుగు మూవీ ‘గోపాల గోపాల' రూ. 40 కోట్ల మార్కును క్రాస్ అయింది. ప్రేక్షకుల తాకిడి స్ట్రాంగ్‌గా ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే ఈచిత్రం రూ. 50 కోట్ల మార్కును దాటిపోతుందని అంటున్నారు.

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం ఈచిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. చెన్నై బాక్సాఫీసు వద్ద కూడా దుమ్ము రేపుతోంది. సంక్రాంతి సీజన్ కావడంతో ఫ్యామిలీ ప్రేక్షకుల తాకిడి ఎక్కువగా ఉందని అంటున్నారు. గోపాల గోపాల' చిత్రానికి కిషోర్‌ పార్థసాని దర్శకత్వం వహించారు. డి.సురేష్‌బాబు, శరత్‌ మరార్‌ నిర్మాతలు.

    ‘Gopala Gopala’ crosses the 40 crore mark

    మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెనె్నల కిశోర్, పృధ్వీ, దీక్షాపంత్, నర్రా శ్రీను, రమేష్ గోపి, అంజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: భవేష్ మందాలియా, ఉమేష్ శుక్ల, స్క్రీన్‌ప్లే: కిశోర్‌కుమార్ పార్థసాని, భూపతిరాజా, దీపక్‌రాజ్, కెమెరా: జయనన్ విన్సెంట్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు:చంద్రబోస్, ఎడిటింగ్: గౌతమ్‌రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, నిర్మాతలు: డి.సురేష్‌బాబు, శరత్ మరార్, దర్శకత్వం: కిశోర్ పార్థసాని.

    ‘ఐ' మూవీ కలెక్షన్ల విషయానికొస్తే...
    శంకర్ దర్శకత్వంలో విక్రమ్, అమీ జాక్సన్ హీరో, హీరోయిన్లుగా వచ్చిన ‘ఐ' మూవీ తెలుగు, తమిళం, హిందీ బాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైంది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ. 100 కోట్ల వసూళ్లు అధిగమించినట్లు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తానికి సంక్రాంతి పండగ సీజన్ సినిమా వాళ్లకు సిరుల పంట పండించింది.

    English summary
    Acording to the latest update, Gopala Gopala movie has crossed the coveted 40 cross mark worldwide and is still going strong.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X