Don't Miss!
- News
మూడోసారి.. స్పీకర్ పోచారంకు కరోనా పాజిటివ్.. స్టేబుల్‌గానే
- Sports
జింబాబ్వేతో వన్డే సిరీస్.. ప్రపంచ క్రికెట్‌కు మంచిదన్న శిఖర్ ధావన్..! కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై స్పందిస్తూ..
- Finance
DigiYatra: సులభతరంగా విమాన ప్రయాణం.. అందుబాటులోకి నయా టెక్నాలజీ.. హైదరాబాద్..
- Technology
Sony నుంచి సరికొత్త ఫీచర్లతో Mini LED TV విడుదల! ధర ఎంతంటే!
- Automobiles
ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ది కోసం మహీంద్రా అడ్వాన్స్డ్ డిజైన్ యూరప్ M.A.D.E ప్రారంభం!
- Lifestyle
ధూమపానం మీ ఊపిరితిత్తులకే కాదు మీ శరీరంలో ఇతర అవయవాలకు కూడా ప్రమాదకరమని మీకు తెలుసా?
- Travel
ఫ్లయింగ్ రెస్టారెంట్లో రుచులు ఆస్వాదించాలని ఎవరికుండదు చెప్పండి!
Pakka Commercial Collections: బాక్సాఫీస్ వద్ద గోపిచంద్ హవాా.. 2 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్నా విజయాలను అందుకోలేక ఇబ్బంది పడుతోన్న హీరోలు చాలా మందే ఉన్నారు. అందులో మ్యాచ్ స్టార్ గోపీచంద్ ఒకడు. కెరీర్ ఆరంభంలోనే కొన్ని విజయాలను అందుకున్న అతడు.. చాలా కాలంగా సరైన సక్సెస్ దొరకక ఇబ్బందులు పడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది 'సీటీమార్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. అది కూడా ఆశించిన రీతిలో బ్రేక్ ఇవ్వలేదు.
ఇక, ఇప్పుడు గోపీచంద్ 'పక్కా కమర్షియల్' అనే సినిమాను చేశాడు. ఎన్నో అంచనాలతో శుక్రవారమే విడుదలైన ఈ సినిమాకు టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా 2 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

కమర్షియల్‌గా వచ్చిన గోపీచంద్
గోపీచంద్ - స్టార్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'పక్కా కమర్షియల్'. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించింది. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జాక్స్ బెజాయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఇందులో సత్యరాజ్, రావు రమేష్ సహా పలువురు ప్రముఖులు కీలక పాత్రల చేశారు.
Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి టాలీవుడ్ లవర్ బాయ్.. అప్పుడు మిస్సైనా ఈ సారి కన్ఫార్మ్!

పక్కా కమర్షియల్ బిజినెస్ ఇలా
గోపీచంద్ హీరోగా నటించిన 'పక్కా కమర్షియల్' మూవీ నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 7.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి రూ. 15.20 కోట్ల బిజినెస్ చేసుకుని ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది.

2వ రోజు ఎక్కడ.. ఎంతొచ్చింది
'పక్కా కమర్షియల్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 2వ రోజు కాస్త తక్కువ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 50 లక్షలు, సీడెడ్‌లో రూ. 24 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 26 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 13 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 10 లక్షలు, గుంటూరులో రూ. 11 లక్షలు, కృష్ణాలో రూ. 10 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలతో.. రూ. 1.52 కోట్లు షేర్, రూ. 2.55 కోట్లు గ్రాస్ వచ్చింది.
లేటు వయసులో రెచ్చిపోయిన సుస్మితా సేన్: స్విమింగ్ పూల్‌లో అందాల ఆరబోత

2 రోజులకు కలిపి ఎంతొచ్చింది
'పక్కా కమర్షియల్' మూవీకి ఏపీ, తెలంగాణలో 2 రోజుల్లో మంచి వసూళ్లే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.30 కోట్లు, సీడెడ్‌లో రూ. 66 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 65 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 39 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 31 లక్షలు, గుంటూరులో రూ. 33 లక్షలు, కృష్ణాలో రూ. 28 లక్షలు, నెల్లూరులో రూ. 22 లక్షలతో.. రూ. 4.14 కోట్లు షేర్, రూ. 6.90 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2 రోజుల్లో రూ. 4.14 కోట్లు షేర్ రాబట్టిన 'పక్కా కమర్షియల్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా అంతగా రాణించలేదు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 20లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 55 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపి 2 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గోపీచంద్ సినిమాకు రూ. 5.50 కోట్ల షేర్‌తో పాటు రూ. 10.5 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
శృతి మించిన యాంకర్ స్రవంతి హాట్ షో: బ్లేజర్ విప్పేసి మరీ దారుణంగా!

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
గోపీచంద్ - మారుతి కాంబినేషన్‌లో రూపొందిన 'పక్కా కమర్షియల్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో దీనికి రూ. 5.5 కోట్లు వచ్చాయి. అంటే మరో 9.5 కోట్లు వస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను చేరుతుంది.