twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Seetimaarr Day 1 collections: చరిత్ర సృష్టించిన గోపీచంద్.. ఇండియాలోనే ఫస్ట్ మూవీగా సంచలన రికార్డ్

    |

    కోవిడ్ సెకెండ్ వేవ్ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ, అందులో ఒకటి రెండు మాత్రమే ప్రేక్షకుల అంచనాలను అందుకుని సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. మిగిలినవన్నీ రెస్పాన్స్ దొరకక పరాజయం పాలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో అనుమానాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే 'సీటీమార్'. చాలా కాలంగా హిట్ కోసం వేచి చూస్తోన్న గోపీచంద్ ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే ఇది పాజిటివ్‌ టాక్‌తో మంచి స్పందనను అందుకుంది. దీంతో కలెక్షన్లు కూడా ఊహించని విధంగా వచ్చాయి. మరి ఈ మూవీ బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

    ‘సీటీమార్’ కొట్టాలని గోపీచంద్ రాక

    ‘సీటీమార్’ కొట్టాలని గోపీచంద్ రాక

    గోపీచంద్ - తమన్నా హీరోహీరోయిన్లుగా సంపత్ నంది తీసిన మూవీనే 'సీటీమార్'. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిత్తూరి దీన్ని నిర్మించారు. భూమిక చావ్లా ఇందులో కీలక పాత్రను పోషించింది. అప్సరా రాణి ఓ స్పెషల్ సాంగ్‌ను చేసింది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది.

    ఆ పొరపాటు చేయడం వల్లే సాయి ధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్.. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది!ఆ పొరపాటు చేయడం వల్లే సాయి ధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్.. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది!

    అంచనాల పెరగడంతో భారీ బిజినెస్‌

    అంచనాల పెరగడంతో భారీ బిజినెస్‌


    చాలా కాలంగా హిట్ లేకపోయినా 'సీటీమార్' సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. దీనికి కారణం ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలే. దీంతో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే వినాయక చవితి రోజున ఈ సినిమా ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    పాజిటివ్ టాక్.. అన్ని చోట్లా పెంచారు

    పాజిటివ్ టాక్.. అన్ని చోట్లా పెంచారు

    గోపీచంద్ నటించిన 'సీటీమార్' మూవీకి ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఫలితంగా చాలా ప్రాంతాల్లో థియేటర్లు, షోలను పెంచి మరీ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇలా అన్ని ప్రాంతాల్లో ఆడియెన్స్ సీటీ కొట్టారు. దీంతో చాలా కాలంగా హిట్ కోసం పరితపిస్తోన్న గోపీచంద్‌ కమ్‌బ్యాక్ అయినట్లైంది.

    Bigg Boss: వెక్కి వెక్కి ఏడ్చిన యాంకర్ రవి.. లైఫ్‌లో తొలిసారి ఇలా జరిగిందంటూ బాధగా!Bigg Boss: వెక్కి వెక్కి ఏడ్చిన యాంకర్ రవి.. లైఫ్‌లో తొలిసారి ఇలా జరిగిందంటూ బాధగా!

    తొలి రోజు ఎక్కడ.. ఎంత రాబట్టింది?

    తొలి రోజు ఎక్కడ.. ఎంత రాబట్టింది?

    'సీటీమార్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందన వచ్చింది. ఫలితంగా దీనికి నైజాంలో రూ. 91 లక్షలు, సీడెడ్‌లో రూ. 55 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 30 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 27 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 16 లక్షలు, గుంటూరులో రూ. 41 లక్షలు, కృష్ణాలో రూ. 19 లక్షలు, నెల్లూరులో రూ. 19 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 2.98 కోట్లు షేర్, రూ. 4.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లిలా

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లిలా

    తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రూ. 2.98 కోట్లు షేర్ రాబట్టిన గోపీచంద్ 'సీటీమార్' మూవీ.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 14 లక్షలు, ఓవర్సీస్‌లో (అమెరికాలో ప్రదర్శించలేదు) రూ. 4 లక్షలు రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు రూ. 3.16 కోట్లు షేర్, రూ. 5.10 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేసేసింది.

    Bigg Boss Elimination: వారం చివర్లో మారిపోయిన పోలింగ్.. ఆ ఇద్దరిలో ఒకరు వెళ్లిపోవడం ఖాయం!Bigg Boss Elimination: వారం చివర్లో మారిపోయిన పోలింగ్.. ఆ ఇద్దరిలో ఒకరు వెళ్లిపోవడం ఖాయం!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత వస్తే హిట్?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత వస్తే హిట్?

    గోపీచంద్ నటించిన 'సీటీమార్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా మంచి బిజినెస్ జరుపుకుంది. దీంతో అన్ని ప్రాంతాల్లో కలిపి (అమెరికాలో లేదు) రూ. 11.50 కోట్లు మేర వ్యాపారం జరిగింది. దీంతో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ రూ. 12 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ చిత్రం మొదటి రోజు రూ. 3.16 కోట్లు వసూలు చేసింది. దీంతో మరో రూ. 8.84 కోట్లు వసూలు చేస్తే క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

    Recommended Video

    Seetimaarr Movie Team Vinayaka Chaviti Special Interview
    ఇండియాలోనే ఫస్ట్ సినిమాగా రికార్డు

    ఇండియాలోనే ఫస్ట్ సినిమాగా రికార్డు


    'సీటీమార్' చిత్రానికి మొదటి రోజు ఏకంగా రూ. 5.10 కోట్ల గ్రాస్ వచ్చింది. దీంతో సెకెండ్ వేవ్ తర్వాత విడుదలైన చిత్రాల్లో ఎక్కువ వసూలు చేసిన మొదటి ఇండియన్ మూవీగా ఇది రికార్డు క్రియేట్ చేసింది. దీని తర్వాత 'సాంగ్ చీ', 'బెల్‌బాటమ్' ఉన్నాయి. ఇక, తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.98 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. గోపీచంద్ సెకెండ్ బెస్ట్‌గా నిలిచింది.

    English summary
    Tollywood Talented Hero Gopichand and Sampath Nandi Seetimaarr Movie Released Last Friday. This Movie Collect 3.16 Cr in First Day.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X