twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NRA :' ఆగడు'....'గోవిందుడు అందరివాడేలే' ఒకరికే

    By Srikanya
    |

    హైదరాబాద్ : కృష్ణవంశీ సినిమా అంటే.. ఇంటిల్లిపాదీ చూడాల్సిందే. కుటుంబ కథా చిత్రాలకు కొత్త ఒరవడి తీసుకొచ్చిన కృష్ణవంశీకి కొంతకాలంగా హిట్‌ లేదు. ఇప్పుడాయన 'గోవిందుడు అందరివాడేలే' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉండటంతో బిజినెస్ బాగా జరుగుతోంది. తాజాగా గుంటూరు ఏరియా ఫైనలైజ్ చేసారు. అక్కడ ఎస్ క్రియేషన్స్ వారు ఈ చిత్రం రైట్స్ ని తీసుకున్నారు. ఆగడుని కూడా వీరే డిస్ట్రిబ్యూట్ చేస్తూండటం విశేషం. ఆగడుకు 4.25 కోట్లు పెట్టితీసుకుంటే, గోవిందుడు అందరి వాడేలే చిత్రానికి 4 కోట్లు వెచ్చించినట్లు (NRA పద్దతి) ట్రేడ్ వర్గాల సమాచారం.

    'గోవిందుడు..' కృష్ణవంశీ కెరీర్‌ని మళ్లీ హైవే ఎక్కిస్తుందని యూనిట్ అంతా నమ్మకంగా చెబుతోంది. ప్రచార చిత్రాలు చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తోంది. ఆ కష్టం ఫలించి.. 'గోవిందుడు..' కాసుల వర్షం కురిపిస్తే అంతకంటే కావల్సిందేముంది? అంటున్నారు. అక్టోబరు 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

    'గోవిందుడు అందరివాడేలే' తాజా సమాచారం ...

    Guntur : GAV goes to Aagadu Distributor!

    లండన్‌లో పుట్టి పెరిగి అక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు అలవాటు పడిన అభిరామ్ అనే యువకుడు తన మూలాల్ని వెతుక్కుంటూ ఓ అందమైన తెలుగు పల్లెకు వస్తాడు. అక్కడ అతను సరికొత్త జీవితాన్ని దర్శిస్తాడు. పల్లె అప్యాయతలు, అనుబంధాలకు ముగ్ధుడవుతాడు. అభిరామ్ అందరివాడనిపించుకుంటాడు. ఈ క్రమంలో జరిగే భావోద్వేగభరిత సంఘటనల సమాహారమే గోవిందుడు అందరివాడేలే చిత్ర ఇతివృత్తం అన్నారు కృష్ణవంశీ.

    ఆయన దర్శకత్వంలో రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం లండన్‌లోని సుందరమైన లొకేషన్లలో పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ నెల 15న ఆడియోను, అక్టోబర్ 1న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ కుటుంబ బంధాలకు దర్పణంలా ఈ సినిమా వుంటుంది. రామ్‌చరణ్ పాత్ర చిత్రణలో భిన్న పార్శాలుంటాయి.

    మా బ్యానర్‌కు మరింత గుర్తింపునిచ్చే చిత్రమవుతుంది అన్నారు. ప్రకాష్‌రాజ్, జయసుధ, ఎం.ఎస్.నారాయణ, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు, పోసాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: యువన్‌శంకర్‌రాజా, ఆర్ట్: అశోక్‌కుమార్, ఎడిటింగ్: నవీన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, రామ్‌లక్ష్మణ్, రచన: పరుచూరి బ్రదర్స్, దర్శకత్వం: కృష్ణవంశీ.

    English summary
    S creations will now be distributing both films in the area and they have got GAV for 4 Cr and Aagadu at 4.25Cr NRA.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X