Pawan Kalyan Rana హిందీ డబ్బింగ్ రైట్స్‌లో న్యూ రికార్డ్.. అత్యధిక ధరకు అమ్ముడైన టాప్ సినిమాలు ఇవే!

బాలీవుడ్ వెండితెరపై మన హీరోలు పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికి డబ్బింగ్ సినిమాలతో మాత్రం బుల్లితెరపై ఒక రేంజ్ లో సక్సెస్ అవుతున్నారు. ఇక యూ ట్యూబ్ లో అయితే మన హీరోల డిజాస్టర్ సినిమాలు కూడా ఒక రేంజ్ లో హిట్టవుతున్నాయి. టాలీవుడ్ హిందీ డబ్బింగ్ సినిమాలు వందల మిలియన్ల వ్యూవ్స్ అందుకుంటున్నాయి. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ రానా అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ కూడా భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ లో అత్యదిక లాభాలు అందుకున్న టాప్ సినిమాలపై ఒక లుక్కేస్తే...

Recommended Video

Radhe Shyam Vs Sarkaru Vaari Paata Vs PSPK Rana Vs Beast Vs F3
సరిలేరు నీకెవ్వరు

సరిలేరు నీకెవ్వరు

మహేష్ బాబు గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో లాభాలను అందించింది. మహేష్ బాబు కెరీర్ లో కూడా అదొక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక స్టార్ హీరోతో పెద్ద హిట్ అందుకోవాలని చూసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి కోరిక కూడా ఆ సినిమాతో నెరవేరింది. ఇక ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ 15.2కోట్లకు అమ్ముడయ్యాయి.

అరవింద సమేత

అరవింద సమేత

ఎన్టీఆర్ ఏ సినిమా చేసినా కూడా నార్త్ ఆడియెన్స్ హిందీలో డబ్బింగ్ అయితే ఒక్కసారిగా ఎగబడటం కామన్. చాలా సినిమాలు యూ ట్యూబ్ లో విడుదలైన కొన్ని నిమిషాల్లోనే మిలియన్స్ వ్యూవ్స్ అందుకున్నాయి. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత హిందీ హక్కులు 18కోట్లకు అమ్ముడయ్యాయి. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా మంచి వసూళ్లను అందుకుంది.

అల..వైకుంఠపురములో

అల..వైకుంఠపురములో

అల్లు అర్జున్ సినిమాలు అంటే నార్త్ ఆడియెన్స్ ఎంతగానో ఇష్టపడతారు. ఆర్య సినిమా నుంచి బన్నీకి హిందీ డిజిటల్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడవసారి చేసిన అల..వైకుంఠపురములో సినిమా 19కోట్లకు అమ్ముడయ్యింది. మొత్తంగా బన్నీ కెరీర్ లో ఈ మూవీ 200కోట్లకు పైగా బిజినెస్ చేసింది.

 మహేష్ బాబు మహర్షి

మహేష్ బాబు మహర్షి

మహేష్ బాబు - వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన మహర్షి సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ హిట్ గా నిలిచింది. ఇక అంతకుముందే ఈ సినిమాపై అంచనాలు పెరగడంతో హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా 20కోట్లు దక్కాయి. గతంలోనే వంశీ పైడిపల్లి ఎవడు సినిమా హిందీలో అనువాదం అయ్యి మంచి రిజల్ట్ ను అందుకుంది. దీంతో మహేష్ సినిమాకు కూడా ఇంకాస్త హెల్ప్ అయ్యింది.

వినయ విధేయ రామ

వినయ విధేయ రామ

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మాస్ కమర్షియల్ సినిమాలు చేస్తున్నాడు అంటే ఓ వర్గం నార్త్ ఆడియెన్స్ డైరెక్ట్ గా థియేటర్స్ కు వెళ్లి మరీ సినిమాలు చూస్తారు. ఇక బోయపాటి శ్రీను లాంటి మాస్ దర్శకుడితో మొదటిసారి చేసిన సినిమా కాబట్టి వినయ విధేయ రామ హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా 22కోట్లను అందించింది.

పవన్ రానా న్యూ రికార్డ్

పవన్ రానా న్యూ రికార్డ్

ఇక ఇప్పుడు రాబోతున్న హై వోల్టేజ్ మల్టీస్టారర్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ పై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ - రానా మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో హిందీ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ 23కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ఇప్పటివరకు ఈ దారిలో అత్యదిక లాభాలను అందించిన డబ్బింగ్ సినిమా ఇదే అవుతోంది. మరి రానున్న రోజుల్లో ఆ రికార్డును ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X