For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నష్టమా..లాభమా? : ‘ఐ’తెలుగు వెర్షన్ క్లోజింగ్ కలెక్షన్స్

  By Srikanya
  |

  హైదరాబాద్ : విక్రమ్‌, ఎమీజాక్సన్‌ జంటగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఐ'. తమిళంలో ఆస్కార్‌ రవిచంద్రన్‌ నిర్మించిన ఈ సినిమాను మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ సంస్థ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇప్పటివరకూ వచ్చిన డబ్బింగ్ చిత్రాల్లో రోబో ఎక్కువ కలెక్టు చేయగా...ఐ చిత్రం 30 కోట్ల మార్కుని దాటి...సెకండ్ ప్లేస్ లో ఉండటం విశేషం.

  ఈ చిత్రం 38 కోట్లు కు ఇక్కడ తెలుగు వెర్షన్ థియోటర్ రైట్స్ ని ఇవ్వగా... ఈ చిత్రం 31.75 కోట్లు కలెక్టు చేసింది. ఈ చిత్రం నెగిటివ్ టాక్ మూట గట్టుుకన్నా...కలెక్షన్స్ పరంగా కొంచెం కూడా వెనకపడలేదు. తొలివారం కలెక్షన్స్ లో రికార్డుని క్రియేట్ చేయటమే కలిసి వచ్చింది. అయితే అమ్మిన రోటు మాత్రం పూర్తిగా రికవరీ కాలేదు. ఆ కలెక్షన్స్ ఏరియావైజ్ ఓ సారి చూద్దాం.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ఏరియా...కలెక్షన్స్

  నైజాం: Rs 10 కోట్లు

  సీడెడ్: Rs 5.50 కోట్లు

  ఉత్తరాంధ్ర: Rs 2.89 కోట్లు

  గుంటూరు: Rs 2.80 కోట్లు

  కృష్ణా: Rs 1.60 కోట్లు

  తూర్పు గోదావరి: Rs 2.11 కోట్లు

  పశ్చిమ గోదావరి: Rs 1.75 కోట్లు

  నెల్లూరు: Rs 1.40 కోట్లు

  ఎపి &నైజాం కలిసి ఫస్ట్ వీక్ కలెక్షన్స్: Rs 28.05 కోట్లు

  ప్రపంచం వ్యాప్తంగా కలెక్షన్స్ (షేర్ ): Rs 31.75 కోట్లు ( కర్ణాటక : Rs 1.7 కోట్లు; ఓవర్ సీస్: Rs 2 కోట్లు కలిపి)

  I Telugu Version Total Collections

  చిత్రం కథేమిటంటే...

  లింగేష్(విక్రమ్) ఆర్నాల్డ్ జిమ్ లో ఔత్సాహిక బాడీ బిల్డర్. అతని జీవితాశయం మిస్టర్ ఇండియా అవ్వాలని. ఈ లోగా మిస్టర్ ఆధ్రప్రదేశ్ అవుతాడు. అయితే ఆ గెలుపు నుంచే అతనికి శతృవులు మొదలవుతారు. మరో ప్రక్క అతను ...దియా(అమీ జాక్సన్) అనే మోడల్ ని ఆరాధిస్తూంటాడు. ఆమెకు తన తోటి మోడల్ జాన్(ఉపేన్ పటేల్) నుంచి లైంగిక వేధింపులు ఎదురవుతాయి. వాటినుంచి తప్పించుకుని తన కెరీర్ ని నిలబెట్టుకోవటం కోసం లిగేష్ ని మోడల్ గా ప్రమోట్ చేసి వాడుకోవాలనుకుంటుంది.

  అయితే ఆమె లింగేష్ తో ప్రేమలో పడుతుంది. అంతేకాకుండా ఆ పెయిర్ మోడలింగ్ ఫీల్డ్ లో హాట్ గా మారతారు. దాంతో ఆమె ఫ్రొఫిషనల్ వైపు నుంచి లింగేష్ కు శతృవులు ప్రారంభమవుతారు. ఈ లోగా ఊహించని విధంగా ..లింగేష్ ..ఓ అంతుపట్టని వ్యాధి వచ్చి కురూపిలా(ట్రైలర్ లో చూపినట్లు బొబ్బలతో) మారిపోవటం మొదలవుతాడు. ఇంతకీ లింగేష్ అలా మారటానికి కారణం ఏమిటి... దాని వెనక ఉన్న కుట్రను లింగేష్ ఎలా ఛేధించాడు..లింగేష్...దియా ల ప్రేమ కథ ఏమైంది అనేది మిగతా కథ.

  'ఐ' విశేషాలగురించి విక్రమ్ మాట్లాడుతూ...శంకర్‌ దర్శకత్వపు ప్రత్యేకతను ఇదివరకు చూసిన వ్యక్తిని. ఇక ఆయన ప్రభంజనానికి పీసీ శ్రీరామ్‌ కలిస్తే ఎలా ఉంటుందనే.. ఆలోచన చాలా కాలంగా ఉండేది. వీరిద్దరి కలయికలో నటించాలన్నది నా కల. అది 'ఐ'తో నెరవేరింది. చైనాలో తెరకెక్కించిన సన్నివేశాల్లో పీసీ శ్రీరామ్‌ గొప్పతనం ఏంటో సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది అన్నారు.

  సంస్ధ : ఆస్కార్‌ ఫిలింస్‌, మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

  నటీనటులు: విక్రమ్, అమీ జాక్సన్, సురేష్‌గోపి, ఉపేన్‌ పటేల్‌, సంతానం, రాంకుమార్‌ గణేషన్‌, శ్రీనివాసన్‌, సయ్యద్‌ సిద్ధిక్‌ తదితరులు

  ఛాయగ్రహణం: పి.సి.శ్రీరామ్‌,

  సంగీతం: ఏ.ఆర్‌.రెహమాన్‌.

  మాటలు: శ్రీరామకృష్ణ

  కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శంకర్

  నిర్మాత: ఆస్కార్ రవి చంద్రన్

  విడుదల తేదీ: 14, 01,2015.

  English summary
  As the theatrical business is around Rs 38 crore, Vikram and Amy Jackson starrer 'I' could be termed as just an average with a full-run share of Rs 31.75 crore.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X