»   »  జై లవ కుశ.....రూ. 125 కోట్లలో షేర్ ఎంత, డిస్ట్రిబ్యూటర్లకు దక్కిందెంత?

జై లవ కుశ.....రూ. 125 కోట్లలో షేర్ ఎంత, డిస్ట్రిబ్యూటర్లకు దక్కిందెంత?

Posted By:
Subscribe to Filmibeat Telugu
NTR's 'Jai Lava Kusa' has joined the elite club of Rs 125 Cr grossers.

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'జై లవ కుశ' చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు నమోదు చేసింది. రూ. 125 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ వసూలు చేసి టాలీవుడ్ ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్లలో 8వ స్థానం దక్కించుకుంది.

ఎన్టీఆర్ కెరీర్లోనే ది బెస్ట్ చిత్రంగా 'జై లవ కుశ' నిలిచిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషించిన మూడు విభిన్నమైన పాత్రల్లో అభినయం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సినిమా విడుదలై దాదాపు రెండు వారాలైనా ఇంకా మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకెలుతోంది.

ఈ ఏడాది 3వ సినిమా

ఈ ఏడాది 3వ సినిమా

2017లో విడుదలైన సినిమాల్లో రూ. 125 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన చిత్రాల్లో ‘జై లవ కుశ' మూవీ మూడవ చిత్రం. దీనికి కంటే ముందు ‘ఖైదీ నెం 150', ‘బాహుబలి 2' చిత్రాలు 125 కోట్ల గ్రాస్ మార్కును క్రాస్ చేశాయి.


8వ స్థానంలో

8వ స్థానంలో

రూ. 125 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ వసూలు చేసి టాలీవుడ్ ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్లలో 8వ స్థానం దక్కించుకుంది. ఈ సినిమా కంటే ముందు ‘బాహుబలి 2', ‘బాహుబలి', ‘ఖైదీ నెం 150', ‘శ్రీమంతుడు, ‘జనతా గ్యారేజ్2, ‘అత్తారింటికి దారేది', ‘సరైనోడు' చిత్రాలు ఉన్నాయి.


తగ్గని ఆదరణ

తగ్గని ఆదరణ

బాక్సాఫీసు వద్ద వీకెండ్స్ తప్ప వీక్ డేస్‌లో ఆశించిన స్థాయిలో కలెక్షన్ ఉండదు. ఇక రెండో వారంలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. అయితే సినిమా విడుదలైన 12వ రోజు(సోమవారం) గాంధీ జయంతి సెలవు కావడం జై లవ కుశకు కలిసొచ్చింది. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 2 కోట్ల షేర్ సాధించింది.


నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ షేర్

నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ షేర్

జై లవ కుశ చిత్రం 12 రోజుల్లో ఇప్పటి వరకు నైజాం ఏరియాలో రూ. 15.56 కోట్ల షేర్ వసూలు చేసింది.సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ షేర్

సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ షేర్

జై లవ కుశ చిత్రం 12 రోజుల్లో ఇప్పటి వరకు సీడెడ్ ఏరియాలో రూ. 11.05 కోట్ల షేర్ వసూలు చేసింది.నెల్లూరులో డిస్ట్రిబ్యూటర్ షేర్

నెల్లూరులో డిస్ట్రిబ్యూటర్ షేర్

నెల్లూరులో ఎన్టీఆర్ కు ఫాలోయింగ్ ఎక్కువే. ఈచిత్రం ఇక్కడ 12 రోజుల్లో రూ. 2.40 కోట్ల షేర్ రాబట్టింది.గుంటూరు డిస్ట్రిబ్యూటర్ షేర్

గుంటూరు డిస్ట్రిబ్యూటర్ షేర్

గుంటూరు ఏరియాలో ‘జై లవ కుశ' చిత్రం రూ. 5.81 కోట్ల షేర్ రాబట్టింది.కృష్ణ డిస్ట్రిబ్యూటర్ షేర్

కృష్ణ డిస్ట్రిబ్యూటర్ షేర్

కృష్ణ ఏరియాలో ‘జై లవ కుశ' చిత్రం 12 రోజుల్లో రూ. 4.42 కోట్ల షేర్ వసూలు చేసింది.వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ షేర్

వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ షేర్

వెస్ట్ గోదావరి ఏరియాలో ఈచిత్రానికి రూ. 3.49 కోట్ల షేర్ వచ్చింది.ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ షేర్

ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ షేర్

ఈస్ట్ గోదావరి ఏరియాలో 12 రోజుల్లో రూ. 5.27 కోట్ల షేర్ రావడం విశేషం.ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్ షేర్

ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్ షేర్

ఉత్తరాంధ్ర ఓవరాల్ గా 12 కోజుల్లో రూ. 6.48 కోట్ల షేర్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.టోటల్ షేర్

టోటల్ షేర్

మొత్తం 12 కోజుల్లో వరల్డ్ వైడ్ రూ. 72 కోట్ల షేర్(125 కోట్ల గ్రాస్) వచ్చింది. ఇందులో ఏపీ-తెలంగాణ రాష్ట్రాల నుండి రూ. 54.48 కోట్ల షేర్(రూ. 90 కోట్ల గ్రాస్) వచ్చినట్లు తెలుస్తోంది.English summary
NTR's 'Jai Lava Kusa' has joined the elite club of Rs 125+ Cr grossers. The total share in the Telugu states stands at 54.5 Cr and 72 Cr worldwide.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu