దారుణంగా జాన్వీ కపూర్ మూవీ కలెక్షన్లు.. నాలుగు రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే!
బాలీవుడ్ తారలు జాన్వీ కపూర్, రాజ్‌కుమార్ రావు నటించిన రూహీ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. వారాంతంలో సెలవుదినాల రోజు కూడా ప్రేక్షకులను ఈ సినిమా థియేటర్‌కు రప్పించలేకపోవడంతో పేలవమైన కలెక్షన్లు నమోదయ్యాయి. హార్ధిక్ మెహతా దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నాలుగు రోజుల్లో 12.58 కోట్లు మాత్రమే రాబట్టడంతో ఈ సినిమా దారుణమైన పరాజయం దిశగా అడుగులెస్తున్నది.
మహాశివరాత్రి రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన రూహీ చిత్రం తొలి ఆట నుంచి మిశ్రమ స్పందనను కూడగట్టుకొన్నది. తొలి రోజున రూ.3.06 కోట్లు, రెండో రోజున రూ.2.25 కోట్లు, శనివారం రూ.3.42 కోట్లు, ఆదివారం రూ.3.85 కోట్లు సాధించింది. దాంతో మొత్తంగా రూ.12.38 కోట్ల కలెక్షన్లను మాత్రమే నమోదు చేసింది.
అర్ధనగ్నంగా జాక్వలైన్ ఫెర్నాండేజ్ ఫోటోషూట్.. గ్లామర్‌తో దిమ్మతిరిగేలా

రూహీ చిత్రం వారాంతంలో మోస్తారు వసూళ్లను రాబట్టింది. మల్టిప్లెక్స్ థియేటర్లలో కలెక్షన్లు అంత ఆశాజనకంగా లేవు. సోమవారం నుంచి గురువారం వరకు వచ్చే వసూళ్లను బట్టి సినిమా భవిష్యత్ ఆధారపడి ఉంటుంది అని ప్రముఖ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
బికినీ బేబీగా అప్సర రాణి.. స్విమ్మింగ్ పూల్‌లో అలాంటి అవతారంతో
2018లో స్త్రీ సినిమాను రూపొందించిన దినేష్ విజన్ రూహీ చిత్రాన్ని నిర్మించారు. అయితే తొలుత ఈ సినిమా స్త్రీ సినిమాకు సీక్వెల్ అని వార్తలు వచ్చాయి. అయితే వాటిని చిత్ర యూనిట్ ఖండించింది. రూహీ చిత్రం హారర్ కామెడీగా తెరకెక్కింది.


Click it and Unblock the Notifications











