»   » కొనుక్కున్నోళ్ళ నెత్తిన చెంగే

కొనుక్కున్నోళ్ళ నెత్తిన చెంగే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :వెంకటేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ సంయుక్తంగా అంబికా కృష్ణ సమర్పణలో ఇ.సత్తిబాబు దర్శకత్వంలో అల్లరి నరేష్‌ హీరోగా అంబికా రాజా నిర్మించిన చిత్రం జంప్‌ జిలాని . ఇషాచావ్లా, స్వాతి దీక్షిత్‌ హీరోయిన్స్. ఈ చిత్రం మొన్న శుక్రవారం విడుదలైంది. దీని యుఎస్ కలెక్షన్స్ చూసిన వారు షాకైపోతున్నారు. అందిన సమాచారం ప్రకారం అక్కడ 15 లక్షలకు ఈ చిత్రం రైట్స్ ని తీసుకున్నారు, మిగతా ఖర్చులన్నీ 10 లక్షలు అయ్యాయి. మొత్తం 25 లక్షలు ఈ చిత్రానికి ఖర్చుపెడితే...అక్కడ ఈ చిత్రం కేవలం లక్ష రూపాయల మాత్రమే వసూలు చేసింది. అల్లరి నరేష్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రం తమిళ చిత్రం కలగలప్పు కు రీమేక్‌.

Jump Jilani Dumped at US Box Office

ఈ వీకెండ్ యుఎస్ భాక్సాఫీస్ కలెక్షన్స్ ... :

శుక్రవారం 13, జూన్: $1,239

శనివారం 14,జూన్ : $1,590

శనివారం 15, జూన్: $908

మొత్తం గ్రాస్: $3,737 ...19 స్క్రీన్స్ కి

నెట్ షేర్ (at 45%): $1,681 (లక్ష కన్నా తక్కువ)

చిత్రం కథేమిటిటంటే.... నిడదవోలు లో తమ తాతల నుంచి వస్తున్న హోటల్ బిజినెస్ లో నష్టబోయి అప్పులుపాలై ఉంటాడు సత్తిబాబు(అల్లరి నరేష్). హోటల్ నిలబెట్టుకోవటానికి ఏం చేయాలో అర్దం కాని స్ధితిలో ఉన్న అతని దగ్గరకు తమ్ముడు రాంబాబు(మరో నరేష్) వస్తాడు. రాంబాబు అప్పుడే జైలు నుంచి రిలీజ్ అవుతాడు. రాంబాబు ఓ దొంగ...జల్సా రాయుడు..పేకాట పిచ్చోడు. అయితే అన్నగారి కష్టం చూసి ఆ హోటల్ ని తన తాత(కోట)సలహాలతో డవలప్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఈ లోగా ఆ హోటల్ పై ఆ ఊరి పెద్దమనిషి(బెనర్జి)కన్ను పడుతుంది. మరో ప్రక్క ఆ ఊరుకి వచ్చిన ఫుడ్ ఇన్సపెక్టర్(ఇషా ఛావ్లా)తో ప్రేమలో పడతాడు సత్తిబాబు. అయితే ఆమెకో ఫ్యాక్షన్ ప్లాష్ బ్యాక్ ఉంటుంది. పులివెందులలో ఉండే ఆమె బావ ఫ్యాక్షనిస్టు(పోసాని)ఆమెనే పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ సమస్యలనుంచి తమ్ముడు సాయింతో తన లవర్ ని ,హోటల్ ని ఎలా రక్షించుకున్నాడు అనేది మిగతా కథ. అలాగే ఈ కథలో రామాయణంలో పిడకల వేటలా రావు రమేష్ వజ్రాల వేట జరుగుతూంటుంది. అది ఏమిటి...కథ కి దానికి సంభంధం ఏమిటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

English summary
Jump Jilani brought at Rs.25 lakhs speeding it hardly recovered 1 lakh at USA Box Office.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu