twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    K Vishwanath కెరీర్ లో బాక్సాఫీస్ రికార్డులు.. తక్కువ ఖర్చులో నిర్మాతలకు ఎక్కువ లాభాలు!

    |

    కళాతపస్వి కె.విశ్వనాథ్ తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మర్చిపోలేని సినిమాలను తెరపైకి తీసుకువచ్చారు. ఇక ఆయన కెరీర్లో మొదట్లో అయితే కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాలను అందుకునేవి. స్టార్ హీరోలు కూడా కమర్షియల్ గా ఆలోచించకుండా ఆయనతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తిని చూపించేవారు. ఇక విశ్వనాథ్ సినీ జీవితంలో అత్యధిక స్థాయిలో బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాల వివరాలలోకి వెళితే..

    బెస్ట్ క్లాసిక్ శంకరాభరణం

    బెస్ట్ క్లాసిక్ శంకరాభరణం

    1980 లో వచ్చిన శంకరాభరణం సినిమా తెలుగు బెస్ట్ క్లాసిక్ సినిమాల్లో ఒకటి. సాంప్రదాయం సంగీత కళకు అద్దం పట్టేలా ఉండే ఆ సినిమా విడుదలైన అన్ని భాషల్లో కూడా మంచి క్రేజ్ అందుకుంది. హిందీలో కూడా 200 రోజులు ఆడింది. ఈ సినిమాలో పెద్దగా స్టార్ క్యాస్ట్ కూడా లేదు. JV సోమయాజులు, మంజు భార్గవి, చంద్రమోహన్ నటించారు. కెవి. మహదేవన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆయువుగా నిలిచింది.

    బిగ్గెస్ట్ హిట్

    బిగ్గెస్ట్ హిట్

    శంకరాభరణం సినిమా క్రియేట్ చేసిన రికార్డుల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ లో ఈ సినిమాను కేవలం 20 లక్షల పెట్టుబడితో నిర్మించగా ప్రపంచవ్యాప్తంగా అప్పట్లోనే 10 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుందని చెబుతుంటారు. పెట్టిన పెట్టుబడికి అప్పట్లో అత్యధిక ప్రాఫిట్ అందించిన సినిమాల్లో ఇది ఒకటి.

    కమల్ హాసన్ బిగ్గెస్ట్ హిట్

    కమల్ హాసన్ బిగ్గెస్ట్ హిట్

    కె విశ్వనాథ్ అంటే అప్పట్లో ఎంత పెద్ద స్టార్ హీరోయియినా కూడా సినిమా చేసేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపించేవారు. ఇక కమలహాసన్ స్వయంగా విశ్వనాధ్ దగ్గరకు వచ్చి ఆయనతో సినిమా చేస్తానని చెప్పారు. రెమ్యునరేషన్ బడ్జెట్ లాంటి విషయాలలో కూడా ఆయన ఏ మాత్రం కలుగజేసుకోకుండా విశ్వనాథ్ చెప్పినట్లుగా సినిమా చేశారు. దీంతో వీరి కలయికలో చేసిన మొదటి సినిమా సాగర సంగమం అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద కమలహాసన్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా నిలిచింది.

    స్వాతిముత్యం కలెక్షన్స్

    స్వాతిముత్యం కలెక్షన్స్

    ఇక సాగర సంగమం కూడా ఊహించిన విధంగా పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ స్థాయిలో ప్రాఫిట్ అందించింది. ఆ తర్వాత స్వాతిముత్యం సినిమా కూడా వీరి కాంబినేషన్ కు మరీంత ఇంత బలాన్ని చేకూర్చింది. ఆ సినిమాను కేవలం 40 లక్షలతో నిర్మించగా బాక్స్ ఆఫీస్ వద్ద అది కూడా ఏడు నుంచి పది కోట్ల మధ్యలో కలెక్షన్స్ అందుకున్నట్లుగా అప్పట్లో కథనాలు వెలుపడ్డాయి.

    ఎక్కువగా ఖర్చు చేయకుండా..

    ఎక్కువగా ఖర్చు చేయకుండా..

    ఇక సిరివెన్నెలతో పాటు స్వర్ణకమలం అనే సినిమాలు కూడా అప్పట్లో బెస్ట్ క్లాసిక్ సినిమాల్లో ఒకటిగా నిలిచాయి. విశ్వనాథ్ ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో తప్పకుండా మ్యూజిక్ మాత్రం కథలో కలిసే విధంగా ఉండాలి అని జాగ్రత్తలు తీసుకునేవారు. ఆయన బడ్జెట్ కూడా అప్పట్లో హద్దులు దాటేవి కాదు. ఎక్కువగా సెట్స్ వేయకుండా లైవ్ లొకేషన్స్ లోనే నాచురల్ గా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకునేవారు.

    ఆ సంస్థలోనే ఎక్కువ సినిమాలు..

    ఆ సంస్థలోనే ఎక్కువ సినిమాలు..

    కె విశ్వనాథ్ సినిమా కెరిర్ లో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ప్రాఫిట్స్ అందించిన చిన్న సినిమాలలో సప్తపది కూడా ఉంది. ఈ సినిమా కోసం కూడా లక్షల్లో ఖర్చు చేయగా కోట్లలో ప్రాఫిట్స్ అందించింది. అలాగే సిరిసిరిమువ్వ శుభలేఖ వంటి సినిమాలు కూడా ఆయన రేంజ్ ను పెంచాయి.

    అయితే కే విశ్వనాథ్ ఎప్పుడు కూడా కమర్షియల్ ఫార్మాట్లో వెళ్లి అనవసరమైన ఖర్చులు మాత్రం చేయలేదు. అందుకే ఆయన తనతో మంచి సినిమాలు చేసే పూర్ణోదయ సంస్థలోనే ఎక్కువ సినిమాలు చేశారు.

    English summary
    K Viswanath career biggest box office hits and collections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X