»   » కబాలి: తెలుగులో భారీ ప్లాప్, ఎంత నష్టమో తెలుసా? (ఫస్ట్ వీక్ రిపోర్ట్)

కబాలి: తెలుగులో భారీ ప్లాప్, ఎంత నష్టమో తెలుసా? (ఫస్ట్ వీక్ రిపోర్ట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఇటీవల విడుదలైన 'కబాలి' చిత్రం విడుదల ముందు గతంలో ఎన్నడూ ఏ సినిమాకు లేనంత హైప్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదల ముందు వరకు ఆకాశంలో ఉన్న కబాలి... రిలీజ్ తర్వాత నెగెటివ్ టాక్‌తో ఒక్కసారిగా పడిపోయింది.

కబాలి సినిమాకు భారీ హైప్ రావడానికి తోడు... తెలుగులో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసారు. రజనీ క్రేజ్‌, కబాలి హైప్ కారణంగా భారీగా అడ్వాన్స్ బుకింగులు జరిగిపోయాయి. దీంతో 'కబాలి' చిత్రం తెలుగులో తొలి రోజు రూ. 9 కోట్ల ఓపెనింగ్స్ సాధించి అందరినీ ఆశ్చర్య పరిచింది.


అయితే సినిమా విడుదలైన తొలి ఆటకే నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో తర్వాతి రోజు నుండి కలెక్షన్లు భారీగా డ్రాప్ అవ్వడం మొదలైంది. దీంతో తొలి రోజు రూ. 9 కోట్లు వసూలు చేసిన కబాలి...తొలి వారం గడిచే సరికి మరో 10 కోట్లు మాత్రమే రాబట్టుకోగలిగింది.


తెలుగులో కబాలి రైట్స్ ను రూ. 30 కోట్లకు కొనుగోలు చేసారు. ప్రస్తుతం సినిమా పరిస్థితి చూస్తుంటే రూ. 30 కోట్లు రికవరీ అవ్వడం అసాధ్యమే అంటున్నారు ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్. టోటల్ థియేట్రికల్ రన్ లో సినిమా రూ. 22 కోట్లకు మించి వసూలు చేసే అవకాశం లేదని అంటున్నారు.


స్లైడ్ షోలో కబాలి చిత్రం ఇప్పటి వరకు ఏయే ఏరియాల్లో ఎంత మొత్తం వసూలు చేసిందనే విశేషాలు...


నైజాం..

నైజాం..

నైజాం ఏరియాలో కబాలి చిత్రం తొలి వారం రూ. 7.6 కోట్లు వసూలు చేసింది.


సీడెడ్

సీడెడ్

సీడెడ్ ఏరియాలో కబాలి చిత్రం తొలి వారం రూ. 3.3 కోట్లు వసూలు చేసింది.


ఆంధ్ర

ఆంధ్ర

ఆంధ్రా ప్రాంత జిల్లాల్లో మొత్తం కలిపి తొలి వారం రూ. 8 కోట్ల వరకు వసూలు చేసింది.


వరసగా మూడో ప్లాప్

వరసగా మూడో ప్లాప్

కబాలితో రజనీ తెలుగులో వరుసగా మూడో ప్లాప్ నమోదు చేసారు. గతంలో ఆయన నటించిన విక్రమసింహ, లింగా చిత్రాలు భారీ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే.


భారీ నష్టం

భారీ నష్టం

తెలుగు రైట్స్ రూ. 30 కోట్లకు దక్కించుకున్న డిస్ట్రిబ్యూటర్ ఈ సారి భారీగా నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది.


English summary
Kabali Telugu version’s theatrical rights were bought for 30 crore and the trade estimates that it will end up below 22 crore in its entire theatrical run. Kabali collected 7.6 crore in Nizam in its first week. In Ceded it collected 3.3 crore and in Andhra it collected just over 8 crore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu