Kantara 1 Telugu Rights: కాంతారా 2 తెలుగు రైట్స్ కు భారీ ధర.. ఎన్ని కోట్లంటే?
2022లో విడుదలైన కాంతార : ఛాప్టర్ 1 చిత్రం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ లోనూ దుమ్ములేపింది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ఈ పౌరాణిక చిత్రం ఇండియా వైడ్ గా ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి, యంగ్ బ్యూటీ సప్తమి గౌడ జంటగా నటించారు. రిషబ్ శెట్టి కథను అందించడమే కాకుండా ఆయనే దర్శకత్వం వహించారు. మరోవైపు ప్రధాన పాత్రలో ఆయనే నటించారు. 2022 సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనంగా మారింది.
బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ కాంతారా చిత్రానికి గానూ రిషబ్ శెట్టి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కెటగిరిటీలో ఏకంగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఈ చిత్రానికి రూ.14 కోట్ల బడ్జెట్ ను వెచ్చించి హోంబలే ఫిల్మ్స్ వారు గ్రాండ్ గా నిర్మించారు. ఇక థియేట్రికల్ రన్ ద్వారా బాక్సాఫీస్ నుంచి ఏకంగా రూ.450 కోట్లు వసూల్ చేసింది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఈ స్థాయిలో ప్రాఫిట్ అందుకున్న తొలి చిత్రం ఇదే. ఇంత భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి రిషబ్ శెట్టి ప్రీక్వెల్ ను కూడా ప్రకటించారు. ఇక ప్రస్తుతం ప్రీక్వెల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ సందర్భంగా కాంతార : చాప్టర్ 1 గా పార్ట్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతంది. కాంతార 2ను హోంబలే ఫిల్మ్స్ ఏకంగా రూ.125 కోట్ల బడ్జెట్ తో నిర్మించడం విశేషం. ఇక ఈ చిత్రం 2 అక్టోబర్ 2025 తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. అంతే కాదు ఈ చిత్రాన్ని కన్నడంతో పాటు, తెలుగుతో పాటు హిందీ, తమిళం, బెంగాలీ, మలయాళం భాషల్లో గ్రాండ్ గా విడుదలకు రెడీ అయ్యింది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ను భారీ ధరలకు అమ్ముడు పోతున్నాయి.
కాగా, తెలుగు డబ్డ్ వెర్షన్ లో కాంతార 1 చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ గీతా ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్, వారాహి చలన చిత్రం వంటి సంస్థ తెలుగు స్టేట్స్ లో విడుదల చేస్తున్నారు. అయితే తెలుగు థియేట్రికల్ రైట్స్ కు భారీ ధర పలికిందని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ + తెలంగాణ కలుపుకొని రూ.70 కోట్లకు అమ్ముడు పోయినట్టు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఒక కన్నడ చిత్రానికి ఈ స్థాయిలో తెలుగు రైట్స్ ధర పలకడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఇక కాంతార 1 చిత్రంలో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు తమిళ స్టార్ జయరామ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా మళ్లీ అలరించబోబోతోంది. మరోవైపు రాకేష్ పూజారి, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అరవింద్ కష్యప్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. బీ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రం ఇండియాతో పాటు చైనాలో రిలీజ్ కాబోతుండటంతో 2500కు పైగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











