Kantara Chapter 1 Day 2 AP TG Collection: ఆంధ్రా, నైజాంలలో కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్.. 2వ రోజు ఎన్ని కోట్లంట
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు నిర్మించిన చిత్రం కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. గతంలో వచ్చిన కాంతారకు ప్రీక్వెల్‌గా ఈ సినిమాను నిర్మించారు. అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా కాంతార చాప్టర్ 1 విడుదలైంది. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించగా.. జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీత సారథ్యం వహిస్తుండగా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా, సురేష్ మల్లయ్య ఎడిటింగ్ బాధ్యలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? రెండో రోజు ఆంధ్రా, నైజాంలలో కాంతార చాప్టర్ 1 ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే..
కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార వ్యయంతో కలిపి కాంతార చాప్టర్ 1కు 125 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో కాంతార చాప్టర్ 1 థియేట్రికల్ రైట్స్ 100 కోట్లకు అమ్ముడయ్యాయి. నైజాంలో 40 కోట్లు, ఆంధ్రలో 45 కోట్లు, సీడెడ్ ఏరియాలో 15 కోట్లుగా చెబుతున్నారు. కాంతార చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే 101 రూపాయల షేర్, 202 కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టాల్సి ఉంది.

కాంతార చాప్టర్ 1 బ్రేక్ ఈవెన్ టార్గెట్
ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్ రికార్డు స్థాయిలో 169 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 13 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 20 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియా రైట్స్ 96 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 44.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సుమారుగా 440 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రిషబ్ శెట్టి మూవీ లాభాల్లోకి రావాలంటే.. బాక్సాఫీస్ వద్ద దాదాపు 850 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. భారీ అంచనాల మధ్య కాంతార చాప్టర్ 1 చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా 4400 థియేటర్‌లలో విడుదల చేశారు.
కాంతార కలెక్షన్స్
తొలి రోజు పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి ఇండియా వైడ్‌గాకాంతార చాప్టర్ 1కు 61.85 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాగా.. రెండో రోజు 46 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్లు సాక్‌నిక్ తెలిపింది. దాంతో కేవలం రెండ్రోజుల్లో రిషబ్ శెట్టి మూవీ 100 కోట్ల క్లబ్‌లో చేరి ఇండియాలో మొత్తంగా 108 కోట్ల రూపాయల నెట్.. 120 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఇక ఓవర్సీస్‌లో రెండు రోజులు ముగిసేసరికి 13.5 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది. దాంతో కాంతార చాప్టర్ 1 చిత్రం రెండ్రోజుల వరకు వరల్డ్ వైడ్‌గా 134 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. కాంతార చాప్టర్ 1 రెండ్రోజుల వరకు కన్నడంలో 34 కోట్ల రూపాయలు, హిందీలో 32 కోట్ల రూపాయలు, తమిళంలో 11 కోట్ల రూపాయలు, మలయాళంలో 7 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 13.5 కోట్ల రూపాయలు రాబట్టింది.
కాంతార చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల వసూళ్లు
కాంతార చాప్టర్ 1కు కన్నడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆదరణ దక్కుతోంది. ఇక్కడ తొలి రోజున పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి ఈ సినిమాకు 13 కోట్ల రూపాయలు, రెండో రోజున 12 కోట్ల రూపాయల నెట్ రాబట్టింది కాంతార. మొత్తంగా రెండ్రోజుల్లోనే 25 కోట్ల రూపాయల నెట్ అందుకుంది కాంతార. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 101 కోట్ల రూపాయల షేర్, 200 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. మరి ఈ సినిమా ఆంధ్రా, నైజాంలలో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











