400 కోట్ల మైలురాయిని దాటిన కాంతార చాప్టర్ 1.. దేశ, విదేశాల్లో కొనసాగుతున్న బాక్సాఫీస్ విధ్వంసం!

కన్నడ సూపర్ స్టార్ రిషబ్ శెట్టి నటించిన కాంతార చాప్టర్ 1 చిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్నది. దక్షిణాదిలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ హోంబలే నిర్మాణంలో విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ చిత్రం రికార్డులు క్రియేట్ చేస్తున్నది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రుక్మిణి వసంత్ నటించిన ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల, అన్ని భాషల్లో సంచలనాలు క్రియేట్ చేస్తున్నది. ఈ చిత్రం 6 రోజుల్లోనే 400 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా వివిధ భాషల్లో ఏ మేరకు వసూళ్లను సాధించిందనే వివరాల్లోకి వెళితే..

కాంతార చాప్టర్ 1 సినిమాను సుమారుగా 30 దేశాల్లో రిలీజ్ చేశారు. యూకేలోనే 100 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను కేరళలో పృథ్వీరాజ్ సుకుమారన్, నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్, అమెరికాలో ప్రత్యాంగీరా సినిమాస్, యూకేలో డ్రీమ్స్, ఇతర దేశాల్లో ఫార్స్ ఫిల్మ్స్, ఆస్ట్రేలియాలో డ్రీమ్ స్క్రీన్స్ ఇంటర్నేషనల్ సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి.

Kantara Chapter 1 Crossed 400 Crore

కాంతర చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద బారీ వసూళ్లు రాబట్టడంతో కాంతార చాప్టర్ 1 సినిమాకు భారీగా బిజినెస్ జరిగింది. ఈ చిత్రం నైజాం థియేట్రికల్ హక్కులు 40 కోట్ల రూపాయలు, ఆంధ్రా రైట్స్ 45 కోట్ల రూపాయలు, సీడెడ్ 15 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ 100 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 170 కోట్ల రూపాయల మేర వసూలు చేయాల్సిన పరిస్థితి ఉంది.

కర్ణాటక హక్కులు రికార్డు స్థాయిలో 169 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 13 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 20 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియా రైట్స్ 96 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 44.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా సుమారుగా 440 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 850 కోట్ల రూపాయల మేర కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. 20 కోట్లకుపైగా, సీడెడ్‌లో 7 కోట్లకుపైగా, ఉత్తరాంధ్రలో 7 కోట్లు, తూర్పు గోదావరిలో 3 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 కోట్ల రూపాయలు, గుంటూరులో 3 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 3.5 కోట్ల రూపాయలు, నెల్లూరు జిల్లాలో 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం 66 కోట్ల గ్రాస్, 45 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను సాధించింది.

కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం గత 5 రోజుల్లో సాధించిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి. కర్ణాటకలో 93 కోట్ల రూపాయలు, తెలుగులో 66 కోట్ల రూపాయలు, హిందీలో 94 కోట్ల రూపాయలు, తమిళంలో 27 కోట్ల రూపాయలు, మలయాళంలో 23 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఈ సినిమా మొత్తంగా ఇండియాలో 308 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా గత 5 రోజుల్లో ఓవర్సీస్‌లో 75 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 365 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఈ సినిమా 6వ రోజు 40 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం 400 కోట్ల రూపాయల మైలురాయిని దాటింది అని ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి. ఈ సినిమా తన లైఫ్ టైమ్ థియేట్రికల్ రన్‌లో 800 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X