For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sardar 2 Weeks Collections: 41 కోట్ల టార్గెట్.. తెలుగులో కోట్ల లాభాలు.. మిగిలిన భాషల్లో మాత్రం!

  |

  తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది హీరోలకు తెలుగులోనూ మార్కెట్లు ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఇలా ఇప్పటికే ఎంతో మంది స్టార్లు రెండు రాష్ట్రాల్లో కలెక్షన్లను రాబడుతూ సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో కార్తి ఒకడు. సుదీర్ఘ కాలంగా ఎన్నో చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. ఇటీవలే 'సర్దార్' అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు అన్ని ఏరియాల్లోనూ మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా తెలుగులో హిట్ అయింది. ఈ నేపథ్యంలో 'సర్దార్' 2 వారాల రిపోర్టు చూద్దాం పదండి!

  సర్ధార్‌గా హీరో కార్తి అరాచకం

  సర్ధార్‌గా హీరో కార్తి అరాచకం


  తమిళ స్టార్ కార్తి హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన సినిమానే 'సర్దార్'. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో రజీషా విజయన్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా చేశారు. అలాగే, చుంకీ పాండే, లైలా కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ తమిళం, తెలుగులోనూ రిలీజ్ అయింది.

  బాత్రూంలో హాట్‌గా మెగా హీరోయిన్: ఆ డ్రెస్సు.. ఆమె ఫోజు చూశారంటే!

  సర్దార్ ప్రీ బిజినెస్ వివరాలు

  సర్దార్ ప్రీ బిజినెస్ వివరాలు

  పేరుకు కోలీవుడ్ హీరోనే అయినా కార్తికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మార్కెట్ బాగానే ఉంది. దీనికితోడు అతడి తాజా చిత్రం 'సర్ధార్'పై ఆరంభం నుంచే అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాలకు కలిపి రూ. 5.00 కోట్లు మేర బిజినెస్ అయింది. దీంతో దీన్ని తెలుగులోనూ భారీగానే విడుదల చేసుకున్నారు.

  14వ రోజు తెలుగు వసూళ్లిలా

  14వ రోజు తెలుగు వసూళ్లిలా


  చాలా రోజులుగా భారీ విజయం కోసం వేచి చూస్తోన్న కార్తి నటించిన తాజా చిత్రమే 'సర్ధార్'. ఈ మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమాకు వసూళ్లు భారీగానే వస్తున్నాయి. ఇలా ఇప్పటికే ఈ చిత్రం టార్గెట్‌ను కూడా చేరుకుంది. ఈ క్రమంలోనే 14వ రోజు మాత్రం ఈ సినిమాకు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 6 లక్షలు షేర్ రాబట్టింది.

  Poorna Marriage Gift: పూర్ణకు భర్త పెళ్లి కానుక.. బంగారంతో పాటు లగ్జరీ హౌస్.. వాటి ధర ఎంతో తెలిస్తే!

  2 వారాలకు కలిపి కలెక్షన్లు

  2 వారాలకు కలిపి కలెక్షన్లు

  అంధ్రప్రదేశ్, తెలంగాణలో 'కార్తి' మూవీ 2 వారాల్లో మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 3.05 కోట్లు, సీడెడ్ ప్రాంతంలో రూ. 91 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 3.36 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని ఈ మూవీ రూ. 7.32 కోట్లు షేర్‌తో పాటు రూ. 14.30 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

  టార్గెట్ ఎంత? లాభం ఎంత

  టార్గెట్ ఎంత? లాభం ఎంత


  తమిళ స్టార్ కార్తి నటించిన 'సర్ధార్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 5.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5.50 కోట్లుగా నమోదైంది. ఇక, 2 వారాల్లో దీనికి రూ. 7.32 కోట్లు వచ్చాయి. అంటే.. ఈ మూవీ హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.82 కోట్లు లాభాలతో రికార్డు సాధించింది.

  వంద కోట్ల దర్శకుడితో బాలయ్య: పాన్ ఇండియాపై దండయాత్ర.. టాప్ ప్రొడ్యూసర్ భారీ ప్లాన్

  ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు

  ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు


  2 వారాల్లో తెలుగు రాష్ట్రాల్లో కార్తి 'సర్దార్' మూవీ రూ. 14.30 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. అలాగే, తమిళనాడులో ఇది రూ. 43.50 కోట్లు, కర్నాటకలో రూ. 3.35 కోట్లు, కేరళలో రూ. 1.52 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.30 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 20.05 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 84.02 కోట్లు గ్రాస్‌, రూ. 42.85 కోట్ల షేర్ రాబట్టింది.

  సినిమా హిట్టా? ఫట్టా? అంటే

  సినిమా హిట్టా? ఫట్టా? అంటే


  క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'సర్దార్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 40.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 41.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ చిత్రం రెండు వారాల్లో రూ. 42.85 కోట్లు షేర్‌ను రాబట్టింది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.35 కోట్ల లాభాలు అందుకుంది.

  English summary
  Kollywood Star Hero Karthi Did Sardar Movie Under P. S. Mithran Direction. This Movie Collects 7.32 Crore in 2 Weeks.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X