»   » కష్టాలు తీరుద్దామని ‘కాటమరాయుడు’ తీస్తే.... మరింత కష్ట పెట్టింది!

కష్టాలు తీరుద్దామని ‘కాటమరాయుడు’ తీస్తే.... మరింత కష్ట పెట్టింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' సినిమా చేయడానికి ప్రధాన కారణం.... తన గత సినిమా 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా ద్వారా నష్టపోయిన వారిని ఆదుకోవాలనే ఉద్దేశ్యంతోనే. బయ్యర్ల కష్టాలు తీరుద్దామనే ప్రధాన ఉద్దేశ్యంతో తీసిన ఈ చిత్రం వారిని మరింత కష్టపెట్టిందనే టాక్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

విడుదల ముందు ఈ సినిమా ఎంత భారీ అంచనాలతో ఉందో.... రిలీజ్ తర్వాత అంతగా డీలా పడిపోయింది. తొలి రోజు ఓపెనింగ్స్ బావున్నాయే తప్ప రెండో రోజు నుండి సినిమా బాక్సాఫీసు వద్ద డీలా పడుతూ వచ్చింది. తొలివారంలోనే సినిమా దుకాణం సర్దేసే పరిస్థితి వచ్చేసింది.

సగంతోనే సరిపెట్టుకోవాల్సిందేనా?

సగంతోనే సరిపెట్టుకోవాల్సిందేనా?

సినిమా కనీసం రూ. 100 నుండి 120 కోట్లు వసూలు చేస్తుందని అంతా అనుకున్నారు. అయితే పరిస్థితి ఊహించిన దానికి చాలా భిన్నంగా ఉంది. ఊహించిన దానిలో సగం రీచ్ అవ్వడమే గగనంగా మారింది.

రూ. 60 కోట్లు దాటే పరిస్థితి లేదు

రూ. 60 కోట్లు దాటే పరిస్థితి లేదు

ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కాటమరాయుడు సినిమా రూ. 60 కోట్ల మార్కును దాటి వెళ్లే పరిస్థితి లేదని అంటున్నారు. సెకండ్ వీకెండ్ ముగిసినా సినిమా రూ. 60 కోట్ల మార్కును అందుకోక పోవడమే ఇందుకు కారణం. ఇప్పటి వరకు రూ. 58 కోట్ల మాత్రమే వచ్చాయట.

నష్టాలే...

నష్టాలే...

సినిమాను కొన్న బయ్యర్లు లాభ పడాలంటే సినిమా మొత్తం ఓవరాల్ గా 87.5 కోట్ల షేర్ సాధించాల్సి ఉంది. అయితే పరిస్థితి చూస్తుంటే ఇది అసాధ్యమనే అంటున్నారు. సినిమా కనీసం 70 కోట్లు రాబట్టినా కొద్దిపాటి నష్టాలు తప్పదు. కానీ ఈ మార్కును కూడా అందుకోకపోతే భారీ నష్టాలు తప్పవు.

తెలుగు రాష్టాల్లో ఇప్పటి వరకు

తెలుగు రాష్టాల్లో ఇప్పటి వరకు

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఈ చిత్రం 47.37 కోట్ల షేర్ సాధించింది. నైజాంలో 14.20 కోట్ల, సీడెడ్ లో 7.75 కోట్లు, ఉత్తరాంధ్ర 6.01 కోట్లు, ఈస్ట్ 5.14 కోట్లు, వెస్ట్ 4.09 కోట్లు, కృష్ణా 3.47 కోట్లు, గుంటూరు 4.72 కోట్లు, నెల్లూరు 1.99 కోట్ల షేర్ వసూలు చేసింది.

ఇతర ప్రాంతాల్లో

ఇతర ప్రాంతాల్లో

యూ.ఎస్.ఏ లో రూ. 3.33 కోట్లు, కర్నాటకలో 5.25 కోట్లు, రెస్టాఫ్ ఇండియా 1.35 కోట్లు, రెస్టాఫ్ వరల్డ్ 1.50 కోట్లు వసూలు చేసి ఓవరాల్ గా వరల్డ్ వైడ్ 58.8 కోట్ల షేర్ వసూలైంది.

English summary
Katamarayudu second weekend share 58.8 cr.The film has faced the heat of new release Guru as collections remained low with below par growth on Sunday. It has failed to register fulls for matinee shows even on 2nd Sunday in some major centres can tell how low the film has been performing.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu