»   » అన్నయ్యను మించిన తమ్మడు: ‘కాటమరాయుడు’ టీజర్ రికార్డ్

అన్నయ్యను మించిన తమ్మడు: ‘కాటమరాయుడు’ టీజర్ రికార్డ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే.... క్రేజ్ ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. త్వరలో పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. శనివారం సాయంత్రం విడుదలైన టీజర్ కు యూట్యూబ్ లో ఊహించని స్పందన వస్తోంది. టీజర్ విడుదలైన కేవలం రెండు గంటల్లోనే మిలియన్ వ్యూస్ రావడం విశేషం. తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి రికార్డ్ ఇదే తొలిసారి. ఇంతకు ముందు అన్నయ్య 'ఖైదీ నెం 150' 3 గంటల్లో 1 మిలియన్ వ్యూస్ సాధించింది.

కాటమరాయుడు ఆదివారం మధ్యాహ్నం సమయానికి 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 24 గంటలు గడిచేలోగా ఈ టీజర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు.

కాటమరాయుడు

కాటమరాయుడు చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తుండగా.... కిషోర్ పార్దసాని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

 హిట్ కాంబినేషన్

హిట్ కాంబినేషన్

ఈ చిత్రంలో పవన్ కళ్యాన్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి గబ్బర్ సింగ్ చిత్రంలో నటిస్తున్నారు. సెంటిమెంట్ రంగా కూడా పవన్, శ్రుతి హాసన్ కాంబినేషన్ బాగా కలిసొస్తుందని భావిస్తున్నారు.

 వీరమ్ రీమేక్

వీరమ్ రీమేక్

తమిళంలో అజిత్ నటించిన ‘వీరమ్' చిత్రానికి రీమేక్ గా ‘కాటమరాయుడు' తెరకెక్కుతోంది. పవన్ కళ్యాణ్ కు గతంలో రీమేక్ కు బాగా కలిసొచ్చాయి. ఈ నేపథ్యంలో కాటమరాయుడుపై అంచేనాలు భారీగా ఉన్నాయి.

 రిలీజ్ ఎప్పుడు?

రిలీజ్ ఎప్పుడు?

సినిమా 2017 మార్చి 29న 'ఉగాది' కి విడుదల కానుంది. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మితమవుతున్న కాటమరాయుడు చిత్రానికి నిర్మాత: శరత్ మరార్, దర్శకత్వం: కిషోర్ కుమార్ పార్ధసాని, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ, కళ: బ్రహ్మ కడలి. చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్, పవిత్ర లోకేష్, రజిత, యామిని భాస్కర్, అస్మిత, రమాదేవి, భానుశ్రీ నటిస్తున్నారు.

English summary
The team of Katamarayudu claimed on social media that the teaser has crossed the 1 million views mark in just 2 hours and the count is rapidly growing.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu