Don't Miss!
- News
సరిహద్దు రాష్ట్రాల్లో బలంగా ఉన్నచోటే.. కేసీఆర్ సభల వెనుక అంతర్యం ఇదే!!
- Automobiles
అమ్మకాల్లో కొత్త మైలురాయి చేరుకున్న TVS iQube: ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం..
- Lifestyle
Chanakya Niti: ఈ వ్యక్తులను ఎప్పుడూ సాయం అడగొద్దు, మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది
- Finance
Stock Market: నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. అది తగ్గటమే కారణమా..?
- Sports
IND vs NZ: స్టార్ స్పోర్ట్స్‌పై మండిపడ్డ రోహిత్ శర్మ.. ఎందుకంటే?
- Technology
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
Baahubali2 రికార్డును బ్రేక్ చేసిన కేజీఎఫ్2.. ఈ సారి బుక్ మై షోలో చరిత్ర
KGF Chapter 2 చిత్రం రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. విడుదలైన మొదటి రోజు ఆట నుంచి కలెక్షన్ల మోత మోగిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నది. అయితే తాజాగా కేజీఎఫ్2 చిత్రం తాజాగా బాహుబలి 2 సినిమాకు సంబంధించిన మరో రికార్డును బ్రేక్ చేసింది. ఆ రికార్డు వివరాల్లోకి వెళితే..

ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో ఇప్పటి వరకు బుక్ మై షో వెబ్‌సైట్‌లో అత్యధికంగా టికెట్ల అమ్మకాలు సాగించిన చిత్రంగా బాహుబలి 2 చిత్రం పేరిట ఉంది. అయితే ఇండియాలో బిగ్గెస్ట్ ఆన్‌లైన్ సినిమా టికెట్లను అమ్మే బుక్‌మైషో వెబ్‌సైట్‌కి రాకీ భాయ్ సీఈవోగా నిలిచారు. ఈ వెబ్‌సైట్‌లో కేజీఎఫ్ 2 చిత్రానికి సంబంధించి 17.1 మిలియన్ టికెట్లను అమ్మడం ప్రస్తుతం సరికొత్త రికార్డుగా మారింది. దాంతో బాహుబలి చిత్రం రెండోస్థానంలో నిలిచింది.
కేజీఎఫ్ సినిమా సృష్టిస్తున్న రికార్డుల నేపథ్యంలో ఇటీవల చిత్ర యూనిట్ హోంబలే ఫిల్మ్స్ , లిస్టో కలిసి కేజీఎఫ్ వెర్స్ అనే ఏపీఐ బిల్డింగ్ ఫ్లాట్‌ఫామ్‌ను క్రియేట్ చేసింది.
ఇక KGF Chapter 2 కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇప్పటి వరకు ఈ చిత్రం 1236 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో 199 రూపాయలు చెల్లిస్తే వీక్షించే వెసులుబాటు కల్పించింది. త్వరలోనే ఈ సినిమాను త్వరలోనే ఉచితంగా తమ సబ్‌స్క్రైబర్లకు చూపించే ప్రయత్నం చేస్తున్నది.