»   »  ఫస్ట్ డే కలెక్షన్స్: బాహుబలి రికార్డ్ ‘ఖైదీ నెం 150’ బద్దలు కొట్టిందా?

ఫస్ట్ డే కలెక్షన్స్: బాహుబలి రికార్డ్ ‘ఖైదీ నెం 150’ బద్దలు కొట్టిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఫస్ట్ డే ఓపెనింగ్స్ విషయంలో తెలుగు సినీ చరిత్రలో ఇప్పటి వరకు టాప్ ప్లేసులో ఉన్న సినిమా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి' చిత్రం మాత్రమే. ఈ చిత్రం తెలుగు వెర్షన్ తొలి రోజు రూ. 35 కోట్లు వసూలు చేసింది. మళ్లీ ఈ రికార్డును బద్దలు కొట్టే స్టామినా బాహుబలి-2కు మాత్రమే ఉందని ఇప్పటి వరకు అంతా అనుకున్నారు.

అయితే అందరి ఊహలను తారు మారు చేస్తూ మెగా స్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ మూవీగా వచ్చిన 'ఖైదీ నెం 150' ఆ రికార్డును బద్దలుకొట్టినట్లు తెలుస్తోంది. ఇంకా అపీషియల్ గా వసూళ్ల వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే వరల్డ్ వైడ్ మొత్తం వసూళ్లు రూ. 39 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

అనధికారికంగా ఏరియా వైజ్ అందుతున్న ఖైదీ కలెక్షన్ వివరాలు ఇలా ఉన్నాయి.

 నైజాం ఏరియాలో

నైజాం ఏరియాలో

నైజాం ఏరియాలో ఖైదీ నెం 150 మూవీ తొలి రోజు రూ. 6.47 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

 సీడెడ్

సీడెడ్

సీడెడ్ ఏరియాలో ఖైదీ నెం 150 చిత్రం తొలి రోజు రూ. 4 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

 కృష్ణ ఏరియా

కృష్ణ ఏరియా

కృష్ణ ఏరియాలో ఖైదీ నెం 150 చిత్రం తొలి రోజు 1.59 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

 గుంటూరు

గుంటూరు

గుంటూరు ఏరియాలో తొలి రోజు ఈ చిత్రం రూ. 2.80 కోట్లు వసూలైనట్లు రిపోర్ట్స్ అందుతున్నాయి.

 నెల్లూరు

నెల్లూరు

నెల్లూరు ఏరియాలో తొలిరోజు ఈ చిత్రం రూ. కోటి వసూలు చేసినట్లు తెలుస్తోంది.

 ఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరి ఏరియాలో తొలిరోజు ‘ఖైదీ నెం 150' చిత్రం రూ. 3.5 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి ఏరియాలో తొలిరోజు చిరంజీవి సినిమా రూ. 3 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

 ఉత్తరాంధ్ర

ఉత్తరాంధ్ర

ఉత్తరాంధ్రలో తొలి రోజు మెగాస్టార్ మూవీ రూ. 2.50 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

 ఆల్ టైమ్ రికార్డ్

ఆల్ టైమ్ రికార్డ్

తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు వసూళ్ల విషయంలో మొత్తం రూ. 24.86 కోట్లు వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.

 వరల్డ్ వైడ్

వరల్డ్ వైడ్

తెలుగు రాష్ట్రాలు, కర్నాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్ అంతా కలిపి రూ. 39 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

English summary
Check out Khaidi no 150 first day boxoffice collections details. Mega Star Chiranjeevi's comeback film creates new record.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu