twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఖైదీ నెం 150... సెకండ్ వీక్ షేర్ ఎంతో తెలుసా?

    ‘ఖైదీ నెం 150’ చిత్రం రెండు వారాల్లో వరల్డ్ వైడ్ రూ. 92.37 కోట్ల షేర్ సాధించింది. త్వరలో రూ. 100 కోట్ల కబ్ల్ లో ఖైదీ నెం 150 చేరడం ఖాయం అంటున్నారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం 150 చిత్రం ఊహకందని కలెక్షన్లతో దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్లో ఫాస్టెస్ట్ 100 కోట్ల గ్రాస్ సాధించిన సినిమాగా రికార్డులకెక్కింది. తొలి వారంలోనే ఈ చిత్రం రూ. 100 కోట్ల గ్రాస్ సాధించింది.

    తాజాగా 'ఖైదీ నెం 150' చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతంగా 2 వారాలు పూర్తి చేసకుంది. ఈ చిత్రం తొలి వారంలోనే రూ. 100 కోట్ల గ్రాస్ సాధించినప్పటికీ ఇంకా.... రూ. 100 కోట్ల షేర్ మాత్రం అందుకోలేక పోయింది.

    గ్రాస్ అంటే... టిక్కెట్ల అమ్మకం ద్వారా వచ్చే మొత్తం. షేర్ అంటే.... థియేటర్ల అద్దె, ఎంటర్టెన్మెంట్ టాక్స్, ఇతర ఖర్చులు పోగా..... డిస్ట్రిబ్యూటర్ లేదా నిర్మాతకు మిగిలే మొత్తం. 'ఖైదీ నెం 150' చిత్రం రెండు వారాల్లో వరల్డ్ వైడ్ రూ. 92.37 కోట్ల షేర్ సాధించింది. ఇప్పటి వరకు తెలుగులో రూ. 100 కోట్లకు పైగా షేర్ సాధించిన సినిమా బాహుబలి మాత్రమే. త్వరలో రూ. 100 కోట్ల షేర్ కబ్ల్ లో ఖైదీ నెం 150 చేరడం ఖాయం అంటున్నారు.

     నెక్ట్స్ వీక్ గ్యారంటీ

    నెక్ట్స్ వీక్ గ్యారంటీ

    జనవరి 26న తెలుగులో పెద్ద సినిమాలేవీ విడుదల కాక పోవడం ‘ఖైదీ నెం 150' చిత్రానికి బాగా కలిసొచ్చే అంశం. మరో వారంలో ఈజీగా రూ.100 కోట్ల షేర్ మార్కును క్రాస్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వస్తున్నారు.

     వాటి ప్రభావం ఉండదు

    వాటి ప్రభావం ఉండదు

    వాస్తవానికి జనవరి 26న సూర్య నటించిన ‘సింగం-3' రిలీజ్ కావాల్సి ఉంది. తమిళనాడులో జల్లికట్టు గొడవ జరుగుతుండటంతో సినిమా వాయిదా పడింది. బాలీవుడ్ సినిమాలు రాయీస్, కాబిల్ చిత్రాలు విడుదలైనప్పటికీ వాటి ప్రభావం....హైదరాబాద్ లో మినహా ఇతర ప్రాంతాల్లో అంతగా ఉండదు.

    తెలుగు రాష్ట్రాల్లో రూ. 69 కోట్లు

    తెలుగు రాష్ట్రాల్లో రూ. 69 కోట్లు

    నైజాం ఏరియాలో ‘ఖైదీ నెం 150' చిత్రం రెండు వారాల్లో రూ. 16.65 కోట్లు వసూలు చేసింది. సీడెడ్ ఏరియాలో రూ. 13.48 కోట్లు, నెల్లూరులో రూ. 3.05 కోట్లు, గుంటూరులో రూ. 6.55 కోట్లు, కృష్ణ ఏరియాలో రూ. 5.13 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 5.59 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 7.49 కోట్లు వసూలు చేయగా.... ఉత్తరాంధ్రలో రూ. 11.45 కోట్లు రాబట్టింది. ఇలా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో రెండు వారాల్లో రూ. 69 కోట్లు 32 లక్షల షేర్ సాధించింది.

     ఇతర రాష్ట్రాల్లో

    ఇతర రాష్ట్రాల్లో

    ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది. కర్నాటకలో రూ. 8.40 కోట్ల షేర్ వసూలు చేసింది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.25కోట్లు రాబట్టింది.

    విదేశాల్లోనూ

    విదేశాల్లోనూ

    ఓవర్సీస్ లో కూడా మెగాస్టార్ చిరంజీవికి ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు అభిమానులు. ఈ చిత్రం రెండు వారాల్లో ఓవర్సీస్ అమెరికా బాక్సాఫీసు వద్ద రూ. 9.90 కోట్లు, రెస్టాఫ్ వరల్డ్ రూ. 3.50 కోట్లు రాబట్టింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ 92 కోట్ల 37 లక్షల షేర్ వసూలు చేసింది.

    English summary
    Megastar's comeback film Khaidi No.150 is now looking to breach into the Rs 100 Cr share club and join the ranks of Baahubali. By the end of its two weeks of theatrical run, Khaidi No.150 collected a monumental worldwide share of Rs 92Cr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X