Krack Collections: మొదటిరోజే మాస్టర్‌కు షాకిచ్చిన క్రాక్.. నాలుగు రోజుల కలెక్షన్లు ఎంతంటే!

క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు రవితేజ. ఆ తర్వాత అద్భుతమైన టాలెంట్‌తో ఆకట్టుకున్న అతడు.. హీరోగా పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి సత్తా చాటుతూ దూసుకుపోతున్నాడు. మరీ ముఖ్యంగా బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు అలరిస్తూ మాస్ మహారాజాగా పేరొందాడు. చాలా కాలం పాటు వరుస విజయాలతో సత్తా చాటిన ఈయన.. ఇటీవల పరాజయాల పరంపరతో సతమతం అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే 'క్రాక్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందన్న దానిపై స్పెషల్ స్టోరీ మీకోసం!

హ్యాట్రిక్ కొట్టేందుకు మరోసారి జతకట్టారు

హ్యాట్రిక్ కొట్టేందుకు మరోసారి జతకట్టారు

గత ఏడాది 'డిస్కో రాజా' వంటి డిజాస్టర్ మూవీతో వచ్చిన రవితేజ.. ఈ సారి పక్కా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే తనకు గతంలో 'డాన్ శ్రీను', 'బలుపు' వంటి హిట్లు ఇచ్చిన యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో జత కట్టి 'క్రాక్' అనే మూవీ చేశాడు. శృతీ హాసన్ హీరోయిన్‌. ఠాగూర్ మధు నిర్మించిన ఈ మూవీకి థమన్ సంగీతం అందించాడు.

మొదటి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకుని

మొదటి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకుని

సంక్రాంతి కానుకగా జనవరి 9న అంటే ఈరోజు 'క్రాక్' విడుదల కావాల్సి ఉండగా.. ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో వివాదాలు చెలరేగాయి. దీంతో సినిమాను 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. మొదటి ఆట నుంచే హిట్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా... సంక్రాంతి రేసులో మొదటి విజేతగా నిలిచింది. మరీ ముఖ్యంగా మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది.

‘క్రాక్' సినిమాలో హైలైట్లు.. ప్రేక్షకులు ఫిదా

‘క్రాక్' సినిమాలో హైలైట్లు.. ప్రేక్షకులు ఫిదా

హిట్ టాక్‌తో దూసుకుపోతోన్న 'క్రాక్' మూవీ కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేస్తుంది. మరీ ముఖ్యంగా ఇందులో మాస్ మహారాజా యాక్టింగ్.. గోపీచంద్ మలినేని టేకింగ్.. ఎస్ ఎస్ థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్.. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. అలాగే, సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ నెగెటివ్ యాక్టింగ్ కూడా బాగా ఆకట్టుకుందనే చెప్పాలి.

మూడు రోజుల కలెక్షన్లు ఎలా వచ్చాయంటే

మూడు రోజుల కలెక్షన్లు ఎలా వచ్చాయంటే

రవితేజ నటించిన 'క్రాక్' సినిమా మొదటి రోజు నుంచే అద్భుతమైన రీతిలో కలెక్షన్లను రాబడుతోంది. ఓపెనింగ్ డే అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 6.54 కోట్లను కలెక్ట్ చేసిన ఈ మూవీ.. రెండో రోజు రూ. 3.15 కోట్లను వసూలు చేసింది. అలాగే, మూడో రోజు రూ. 2.86 కోట్లను రాబట్టి సంక్రాంతి విజేతగా నిలిచింది. బ్రేక్ ఈవెన్‌కు దగ్గర పడడంతో నిర్మాతలు, బయ్యర్లు సంతోషంగా ఉన్నారు.

మొదటిరోజే మాస్టర్‌కు షాకిచ్చిన క్రాక్ మూవీ

మొదటిరోజే మాస్టర్‌కు షాకిచ్చిన క్రాక్ మూవీ

మూడో రోజు రూ. 2.86 కోట్లనే రాబట్టడంతో నాలుగో రోజు 'మాస్టర్' రిలీజ్ వల్ల 'క్రాక్' మూవీ కలెక్షన్లు మరింత తగ్గిపోతాయని అంతా అభిప్రాయపడ్డారు. కానీ, అందుకు భిన్నంగా విజయ్ మూవీకి షాకిచ్చాడు రవితేజ. నాలుగో రోజు మరింత ఊపందుకున్న ఈ సినిమా ఏకంగా రూ. 3.5 కోట్లకు పైగా వసూలు చేసింది. మొత్తంగా నాలుగు రోజులకు రూ. 16 కోట్ల వరకూ రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X