»   »  ఇదేంటి : నానీ రివ్యూలు సూపర్...కలెక్షన్స్ పూర్

ఇదేంటి : నానీ రివ్యూలు సూపర్...కలెక్షన్స్ పూర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాజమౌళి తో చేసిన ఈగ సూపర్ సక్సెస్ అనంతరం సరైన హిట్ పడక..సతమతమవుతున్న నాని...భలే భలే మొగాడివోయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి పూర్తి ట్రాక్ లోకి వచ్చాడు.

అంతేకాక భలే భేలే మొగాడివోయ్ తో నాని భాక్సాపీస్ వద్ద ఈ సినిమాతో మంచి కలెక్షన్ స్టామినా ఉన్న యంగ్ హీరోగా ఎదిగాడు. ఇప్పుడు అదే జోరులో 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'తో ఆడియన్స్ ముందుకు మొన్న శుక్రవారం వచ్చాడు.


'కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రం కి రివ్యూలు అన్నీ అద్బుతంగా సినిమా ఉంది అని వచ్చినా...కలెక్షన్స్ మాత్రం ఆ స్ధాయిలో కనపడటం లేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దానికి కారణం...టైటిల్, పోస్టర్స్ దెబ్బ కొట్టాయంటున్నారు.


భలే భేలే మొగాడివోయ్ చిత్రానికి ప్లస్ అయిన బి,సి సెంటర్లు అన్నీ ఈ సినిమాకు మైనస్ గా మారాయి. సినిమాలో లేయిర్స్ ఎక్కువ ఉన్నా నీట్ గా కథ చెప్పాడన్నా జనాలకు పెద్దగా పట్టడం లేదని వీకెండ్ పూర్ కలెక్షన్స్ ప్రూవ్ చేస్తున్నాయి.


Krishna Gaadi Veera Prema Gadha weak at BO

కృష్ణగాడి వీర ప్రేమగాథ, ఆడియో, టీజర్స్ కు మంచి రెస్పాన్స్ రావటం, గత సినిమాల సక్సెస్ తో నాని మీద ఏర్పడ్డ అంచనాలకు తగ్గట్టుగా బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది. అయితే ఆ స్ధాయిలో ఓపినింగ్స్ కానీ,కలెక్షన్స్ కానీ రాకపోవటం నిరాసపరుస్తున్న అంశం.


ముఖ్యంగా అందాల రాక్షసి సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కటం, కూడా సినిమా మీద అంచనాలు పెరగటానికి మరో కారణమైంది. నాని బాలకృష్ణ అభిమానిగా నటించిన ఈ సినిమాతో మెహరీన్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

English summary
Collections of Nani's ‘Krishna Gaadi Veera Prema Gadha’ are not on par with his last blockbuster, ‘Bhale Bhale Magadivoy’.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu