twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆగని కలెక్షన్స్... 200 కోట్లు రీచ్ అయ్యింది

    By Srikanya
    |

    హైదరాబాద్‌: హృతిక్‌ రోషన్‌ హీరోగా నటించిన క్రిష్‌-3 సినిమా రిలీజ్ రోజు మార్నింగ్ షో కే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం వసూళ్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా అంచనాలను మించి కాసుల వర్షం కురపిస్తోంది. అమీర్‌ఖాన్‌ చిత్రం త్రీ ఇడియట్స్‌, షారుక్‌ ఖాన్‌ నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే ఇప్పటివరకు ఈ క్లబ్‌లో ఉన్నాయి. అందులో చేరిన మూడో చిత్రం క్రిష్‌-3.

    'క్రిష్ 3' సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల రూపాయలను వసూలు చేయడం తనకు ఆనందం కలిగించినా, 'రికార్డు'లపై తనకు అంతగా నమ్మకం లేదని హీరో హృతిక్ రోషన్ అంటున్నాడు. 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సాధించిన 300 కోట్ల రికార్డును 'క్రిష్ 3' అధిగమించినా, ఏ రికార్డు కూడా శాశ్వతం కాదని హృతిక్ వేదాంతం చెబుతున్నాడు. అమీర్ ఖాన్ నటించిన 'ధూమ్ 3' విడుదలై, తన 'క్రిష్ 3' రికార్డుల్ని వెనక్కి నెట్టేయవచ్చని, భవిష్యత్‌లో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరని ప్రశ్నిస్తున్నాడు.

    Krrish 3

    రికార్డులంటే కేవలం అంకెల గారడీ అని, కొత్త సినిమాలు వస్తే పాత సినిమాల ఘనత కాలగర్భంలో కలిసి పోవాల్సిందేనని అంటున్నాడు. ప్రేక్షకులు కోరుకునేలా వినోదాన్ని ఇవ్వాలే తప్ప, హీరోలకు ఈ రికార్డుల గొడవ ఎందుకంటున్నాడు. కాగా, ఇప్పటికే 202 కోట్ల వసూళ్లు దాటిన 'క్రిష్ 3' కొద్ది రోజుల్లోనే 'చెన్నై ఎక్స్‌ప్రెస్' రికార్డు (300 కోట్లు)ను అధిగమించడం ఖాయమని ప్రముఖ బాలీవుడ్ విశే్లషకుడు తరణ్ ఆదర్శ్ అంచనా వేస్తున్నారు. మరో సినిమా విడుదలైతే 'క్రిష్ 3' రికార్డులు కూడా పాతబడి పోతాయని, బాలీవుడ్‌లో ఇదొక నిరంతర పరిణామమని ఆయన అంటున్నారు. మంచి సినిమాలు ప్రేక్షకులను అలరించాలని, భారీ కలెక్షన్లతో సినీ పరిశ్రమ కళకళలాడాలని ఆశించడంలో తప్పులేదని ఆయన చెబుతున్నారు.

    గతంలో రాకేష్ నిర్మించిన 'క్రిష్', 'ధూమ్ 2' తెలుగు,తమిళ భాషల్లో అనువాదం చేయగా హృతిక్‌కు మంచి ఆదరణ లభించింది. బాలీవుడ్‌తో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల్లో కూడా హృతిక్‌కు భారీగా 'ఫ్యాన్ ఫాలోయింగ్' ఏర్పడింది. గతంలో తాను నిర్మించిన 'క్రిష్'ను ప్రతి భారతీయుడు ఆస్వాదించాలన్న తపనతో డబ్బింగా చేయించి ఇతర భాషల్లో విడుదల చేయించినట్లు రాకేష్ గుర్తు చేస్తున్నాడు. దక్షిణాది ప్రేక్షకులూ తన సినిమాలను ఆదరించడం ఎంతో ఆనందం కలిగించిందని అంటున్నాడు. 'క్రిష్ 3'ని అనువాదం చేసి ఎప్పుడు విడుదల చేస్తారని దక్షిణాదికి చెందిన సినీ పంపిణీదారులు తనను పదే పదే అడిగారని తెలిపాడు. కన్నడ, మలయాళం కంటే తెలుగు, తమిళ భాషల్లో సినీ పరిశ్రమ బాగా విస్తరించిందని అంటున్నాడు. వాణిజ్యపరమైన కోణంలో ఆలోచించినా అనువాద చిత్రాలకు దక్షిణాదిలో మంచి డిమాండ్ ఉందని రాకేష్ విశే్లషిస్తున్నాడు. 'ఫిల్మ్ క్రాఫ్ట్' పతాకంపై రాకేష్ దర్శక, నిర్మాతగా రూపొందించిన 'క్రిష్ 3' నవంబర్ 1న విడుదల అయ్యింది.

    English summary
    Rakesh Roshan's Krrish 3 is the third Hindi film to achieve the feat. A section of the industry's doubts vis-à-vis releasing the film in the pre-Diwali (dull) period have been put to rest, as Krrish 3 continues to win hearts and rake in the moolah. Post 3 Idiots and Chennai Express, Krrish 3 is the third film to enter the much-coveted Rs. 200 cr club, besides setting a new record of the highest single day figures on Monday (Rs 35.91 cr).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X