twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాఫీసు వద్ద అదరగొడుతున్న ‘మహానటి’... ఎంత లాభమో తెలుసా?

    By Bojja Kumar
    |

    కీర్తి సురేష్ ప్రధానపాత్రలో సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కించిన 'మహానటి' చిత్రం బాక్సాఫీసువద్ద కలెక్షన్ వర్షం కురిపిస్తూ 'బ్లాక్ బస్టర్' చిత్రాల జాబితాలో చేరిపోయింది. సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లందరికీ మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. బాక్సాఫీసు వద్ద విజయవంతంగా 12 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళ వెర్షన్ కలిపి రూ. 55 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. స్టార్ హీరోలు లేకుండా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ఇంత భారీ మొత్తం వసూలు చేయడాన్ని ట్రేడ్ వర్గాల్లో విశేషంగా చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు టోటల్ రూ. 30 కోట్ల పైచిలుకు డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలైంది.

     తెలుగు రాష్ట్రాల్లో మేజర్ షేర్

    తెలుగు రాష్ట్రాల్లో మేజర్ షేర్

    ‘మహానటి' మూవీ ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో మేజర్ షేర్ వసూలు చేసింది. రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు రూ. 30.40 కోట్ల షేర్ వసూలు చేయగా, ఒక్క నైజాం ఏరియాలోనే రూ. 15.40 కోట్లు రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 17.60 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలైనట్లు తెలుస్తోంది.

    కర్నాటక, తమిళనాడులో...

    కర్నాటక, తమిళనాడులో...

    మన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటకలోనూ ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతోంది. తమిళనాడులో రూ. 2.40 కోట్ల షేర్ వసూలవ్వగా రూ. 84 లక్షల షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. కర్నాటకలో రూ. 3.70 కోట్లు రాబట్టగా ఇందులో రూ. 1.5 కోట్ల షేర్ రాబట్టింది.

    రెస్టాఫ్ ఇండియా

    రెస్టాఫ్ ఇండియా

    ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో ఎక్కువగా మల్టీ ప్లెక్సుల్లో ‘మహానటి' సినిమా ప్రదర్శితం అయింది. రెస్టాఫ్ ఇండియా మొత్తం రూ. 3.10 కోట్ల గ్రాస్ వసూలైంది. ఇందులో రూ. 1.12 కోట్ల షేర్ రాబట్టినట్లు సమాచారం.

    యూఎస్ఏలో కలెక్షన్ల ప్రభంజనం

    యూఎస్ఏలో కలెక్షన్ల ప్రభంజనం

    తెలుగు రాష్ట్రాల తర్వాత మహానటి చిత్రానికి యూఎస్ఏలో అత్యధిక కలెక్షన్లు వచ్చాయి. యూఎస్ఏలో ఈ చిత్రం రూ. 15.40 కోట్లు రాబట్టింది. ఇందులో రూ. 9.24 కోట్ల షేర్ రాబట్టింది.

    భారీగా లాభాలు

    భారీగా లాభాలు

    ‘మహానటి' మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ. 20 కోట్లకు అమ్మారు. సినిమా ఇప్పటి వరకు రూ. 30 కోట్ల పై చిలుకు షేర్ వసూలు చేయడంతో నిర్మాతలతో పాటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మంచి లాభాలు తమ ఖాతాలో వేసుకున్నారు.

    English summary
    Keerthy Suresh starrer Mahanati has earned a 'blockbuster' status at the box office. By the end of 12 days, Mahanati earned Rs 55 crore at the worldwide box office. The global distributors' share stands at Rs 30.30 crore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X