twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    8 డేస్ రిపోర్ట్: ‘మహర్షి’ కలెక్షన్స్ కేక, 2019లో టాప్ మూవీ ఇదే!

    |

    Recommended Video

    Maharshi 8 Days Collection Report || Filmibeat Telugu

    సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు అదరగొడుతోంది. ఇప్పటికే పలు నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టి వార్తల్లోకి ఎక్కిన ఈ చిత్రం తాజాగా 'ఎఫ్ 2' మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్ రికార్డును అధిగమించి 2019లో హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన మూవీగా నిలిచింది.

    మహేష్ బాబు కెరీర్లో 25వ ల్యాండ్ మార్క్ మూవీ కావడం... దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి లాంటి బడా నిర్మాతలు ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయి ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేశారు. తొలి రోజు ఈ చిత్రం రూ. 48 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే మహేష్ గత చిత్రం 'భరత్ అనే నేను' రికార్డ్(రూ. 54 కోట్లు) అధిగమించడంలో విఫలైంది.

    కాన్సెప్ట్ అద్భుతంగా ఉండటంతో పాజిటివ్ మౌత్ టాక్

    కాన్సెప్ట్ అద్భుతంగా ఉండటంతో పాజిటివ్ మౌత్ టాక్

    దర్శకుడు వంశీపైడిపల్లి ఈ మూవీ కోసం ఎంచుకున్న కాన్సెప్ట్ అద్భుతంగా ఉండటంతో పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అయింది. రైతుల సమస్యలు, వ్యవసాయం ప్రాముఖ్యత వివరించిన తీరు అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతోంది. దీంతో 4 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 102.45 కోట్ల గ్రాస్ రాబట్టింది.

    టోటల్ 8 డేస్ గ్రాస్ రూ. 150.45 కోట్లు

    టోటల్ 8 డేస్ గ్రాస్ రూ. 150.45 కోట్లు

    తొలివారంతంలో పోలిస్తే సోమవారం కలెక్షన్లు జోరు కాస్త తగ్గినా... వసూళ్ల మాత్రం స్టడీగా కొనసాగాయి. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సోమవారం నుంచి గురువారం వరకు ఈ చిత్రం దాదాపు 48 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో టోటల్ 8 డేస్ గ్రాస్ రూ. 150.45 కోట్లకు రీచ్ అయింది.

    2019లో టాప్ మూవీ ఇదే

    2019లో టాప్ మూవీ ఇదే

    2019లో విడుదలైన సినిమాల వసూళ్లను పరిశీలిస్తే... వెంకటేష్-వరుణ్ తేజ్ మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2-ఫన్ అండ్ ఫ్రస్టేషన్' లైఫ్ టైమ్ రన్‌లో రూ. 127.20 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ రికార్డును ‘మహర్షి' కేవలం 8 రోజుల్లోనే అధిగమించి ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో టాప్ పొజిషన్ దక్కించుకుంది.

    ప్రస్తుతం సెకండ్ పొజిషన్, త్వరలో నెం.1 స్థానంలోకి

    ప్రస్తుతం సెకండ్ పొజిషన్, త్వరలో నెం.1 స్థానంలోకి

    ‘మహర్షి' చిత్రం ఇప్పటికే మహేష్ బాబు గత చిత్రం ‘శ్రీమంతుడు' లైఫ్ టైమ్ కలెక్షన్ రికార్డ్ రూ. 144.55 కోట్లను అధిగమించింది. ఇప్పటి వరకు మహేష్ బాబు కెరీర్లో ‘భరత్ అనే నేను' రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లతో మొదటి స్థానంలో ఉండగా... మహర్షి రూ. 150 కోట్లకుపైగా వసూలు చేసి సెకండ్ పొజిషన్ దక్కించుకుంది. లైఫ్ టైమ్ రన్‌లో నెం.1 స్థానంలోకి దూసుకెళ్లే అవకాశం ఉంది.

    లాభం రావాలంటే...

    లాభం రావాలంటే...

    ‘మహర్షి' వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ. 95 కోట్లకు అమ్మారు. గడచిన 8 రోజుల్లో రూ. 82.39 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలైంది. సెకండ్ వీకెండ్ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పాయింట్ చేరుకుని లాభాల భాటలోకి వెళుతుందని అంచనా వేస్తున్నారు.

    మహర్షి

    మహర్షి

    మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా ‘మహర్షి' తెరకెక్కింది. పూజా హెడ్గే హీరోయిన్‌గా నటించగా... అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. ఇంకా ఈ చిత్రంలో అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మాతలు.

    English summary
    Maharshi has beaten the lifetime record of Varun Tej and Venkatesh's F2 – Fun and Frustration(Rs 127.20 cr), which was the highest grossing Telugu movie of 2019. Maharshi 8 days gross Rs. 150.45 cr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X