»   » మహేష్ బాబు సినిమా ప్రొడ్యూసర్ల తీరుతో బయ్యర్లు బెంబేలు!

మహేష్ బాబు సినిమా ప్రొడ్యూసర్ల తీరుతో బయ్యర్లు బెంబేలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ ద్విబాషా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా సినిమా షూటింగ్ మొదలైందో లేదో.. నిర్మాతలు మరో వైపు సినిమాను వీలైనంత ఎక్కువ రేటుకు అమ్మే ప్రయత్నాల్లో మునిగిపోయారు.

రూ. 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ముందు నుండీ ప్రచారం చేస్తున్నారు. మరి ఇంత భారీ ఖర్చు పెట్టి తీస్తున్న సినిమాలో ఏం చూపిస్తారో? కొత్త దనం ఏముంటుందో... ఇప్పుడే చెప్పడం కష్టం. అయితే ఈ సినిమాకు నిర్మాతలు చెబుతున్న రేట్లు చూసి బయ్యర్లు బెంబేలెత్తి పోతున్నారు.

మహేష్ బాబుకు ఓవర్సీస్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న మాట వాస్తవమే. ముఖ్యంగా యూఎస్ఏలో ఆయన సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తాయి. అయితే ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజ్ అవుతుండటంతో రెండు బాషలకు కలిపి నిర్మాతలు చెబుతున్న రేటు చూసి బయ్యర్లు బెంబేలెత్తిపోతున్నారు.

రూ. 25 కోట్లకు తక్కువ కాకుండా అమ్మేది లేదని కొండెక్కి కూర్చున్నారట నిర్మాతలు. ఈ రేటు ప్రకారం చేస్తే... ఈ సినిమా ఓవర్సీస్ లో కనీసం 5 మిలియన్ డాలర్లకు తక్కువ కాకుండా వసూలు చేయాలి. కానీ ఇంత వరకు ఓవర్సీస్ లో మహేష్ సినిమా 3 మిలియన్ డాలర్ల మార్కునే అందుకోలేక పోయింది...ఇలాంటి పరిస్థితుల్లో రూ. 25 కోట్లు పెట్టుబడి పెడితే రిస్క్ తప్పదని అంటున్నారు.

సినిమా హిట్ టాక్ వస్తే...

సినిమా హిట్ టాక్ వస్తే...

సినిమా హిట్ టాక్ వస్తే తెలుగు వెర్షన్ రూ. 12 నుండి 15 (2 నుండి 2.5 మిలియన్ డాలర్స్) కోట్లు వసూలు చేస్తుంది.

తమిళంలో

తమిళంలో

మహేష్ బాబుకు తమిళ జనాల్లో పెద్దగా ఫాలోయింగ్ లేదు, అయితే తమిళంలో మురుగదాస్ పెద్ద డైరెక్టర్ కాబట్టి తమిళ వెర్షన్ 1 మిలియన్ డాలర్ మార్కును దాటే అవకాశం లేదు అని అంటున్నారు.

బయ్యర్ సేఫ్ గా ఉండాలంటే

బయ్యర్ సేఫ్ గా ఉండాలంటే

ఓవర్సీస్ బయ్యర్‌కు నాలుగు డబ్బులు మిగలాలంటే సినిమాకు రూ. 15 కోట్ల కంటే ఎక్కువ పెట్టడం దండగే అని అంటున్నారు.

బ్రహ్మోత్సవం

బ్రహ్మోత్సవం

మహేష్ బాబు గత సినిమా బ్రహ్మోత్సవం చిత్రాన్ని ఓవర్సీస్ బయ్యర్ రూ. 13 కోట్లకు కొన్నారు. సినిమా ప్లాప్ టాక్ రావడంతో దాదాపు సగం మేర నష్టపోవాల్సి వచ్చింది.

మహేష్ బాబు

మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ద్విబాషా చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే.

 హీరోయిన్

హీరోయిన్

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

నమ్రత

నమ్రత

మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కూడా ఈ సినిమాలో నటిస్తోందట. అయితే ఫుల్ లెంగ్త్ మాత్రం కాదు.... ఆమె ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు టాక్.

నిజమా?

నిజమా?

సినిమాలో మెయిన్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అయితే సినిమాలో గెస్ట్ హీరోయిన్ (సెకండ్ హీరోయిన్)పాత్ర కూడా ఉంటుందని, అందులో నమ్రత నటిస్తోందని అంటున్నారు. గతంలో మహేష్, నమ్రత కలిసి వంశీ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

English summary
Mahesh Babu's next film is surely one of the hottest upcoming projects among the trade. Producers have quoted 25 crore for overseas rights for both the versions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu