»   » మహేష్ ‘1’: బాక్సాఫీసు వద్ద గ్రాండ్ ఓపెనింగ్స్

మహేష్ ‘1’: బాక్సాఫీసు వద్ద గ్రాండ్ ఓపెనింగ్స్

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: ప్రేక్షకులు ఎంతగానో ఎదరు చూసిన మహేష్ బాబు నటించిన '1 నేనొక్కడినే' చిత్రం ఈ రోజు విడుదలై బాక్సాఫీసు వద్ద గ్రాండ్ ఓపెనింగ్స్ సాధించింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ఇలా విడుదలైన ప్రతి చోటా సినిమా చూసేందుకు అభిమానులు పొటెత్తారు. మహేష్ మేనియా ఏ రేంజిలో ఉందో ఈ రోజు జాతరను తలపించిన థియేటర్లే నిదర్శనం.

  పరిస్థితి చూస్తుంటే....ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని స్పష్టమవుతోంది. ఈ రోజు సాయంత్రానికల్లా ఫస్ట్ డే కలెక్షన్ల వివరాలు వెల్లడికానున్నాయి. చాలా చోట్ల వీకెండ్ వరకు సినిమా టిక్కెట్లన్నీ ముందుగానే బుక్ అయిపోయాయి.

  ఈ రోజు ఉదయం 4 గంటలకే పలు చోట్ల ప్రత్యేక షోలు ప్రారంభం అయ్యాయి. మార్నింగ్ షో మొదలు కావడానికి ముందే కొన్నిచోట్ల రెండు షోలు ప్రదర్శించేసారు. బిజీ అవర్స్‌లో సినిమా థియేటర్లన్నీ హౌస్ ఫుల్ అవడం చూస్తుంటే....మహేష్ బాబు మేనియా ఏ రేంజిలో ఉందో స్పష్టం అవుతోంది.

  కొన్ని చోట్ల క్రౌడ్ కంట్రోల్ చేయడానికి పోలీసులు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలి రోజు ఈచిత్రం విడుదలైన అన్ని చోట్ల దాదాపు 100 శాతం ఆక్యుపెన్సీ సాధించాయి. కొన్ని చోట్ల బ్లాక్ టికెటింగ్ జోరుగా నడుస్తోంది. బ్లాక్ లో ఒక్కో టిక్కెట్ రూ. 1000 పెట్టి కొనడానికి కూడా అభిమానులు వెనకాడటం లేదు.

  సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్ష్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. క్రితి సానన్ ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. మహేష్ తనయుడు గౌతం కృష్ణ ఈచిత్రం ద్వారా బాల నటుడిగా పరిచయం అవుతున్నాడు.

  English summary
  Mahesh Babu's most anticipated movie 1: Nenokkadine, which has hit the screens today, has embarked on a fantastic start at the Box Office in Andhra Pradesh as well as across the globe. Mahesh mania has reached the peak. As per the early trends, this Sukumar-directed psychological thriller will beat the first collection record of Pawan Kalyan's Attarintiki Daredi and set its own new record at the Box Office.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more