For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫిబ్రవరి 6న... మలయాళంలోకి మహేష్ బాబు

  By Srikanya
  |

  హైదరాబాద్: మహేష్ బాబుకు మళయాళంలోనూ మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. దాంతో ఆయన చిత్రాలను డబ్బింగ్ చేసి అక్కడ విడుదల చేస్తూ వస్తున్నారు. అదే కోవలో గత సంవత్సరం జనవరిలో విడుదలైన ‘1 నేనొక్కడినే'చిత్రాన్ని సైతం డబ్బింగ్ చేసి విడుదలకు సిద్దం చేస్తున్నారు. ‘1 ఒరుత్తం' పేరుతో అనువదించారు. ఈ సినిమా మలయాళంలో ఫిబ్రవరి 6న విడుదలకు సిద్దమయింది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  హాలీవుడ్ స్టాండర్డ్స్ లో రూపొందిన ఈ చిత్రం థ్రిల్లర్ జానర్ కి చెందినది. ఈ చిత్రం కథ ఎమోషన్ తో కూడిన రివేంజ్ తో సాగుతుంది. మహేష్ బాబు స్టైలిష్ లుక్ లో రాక్ స్టార్ గా నటించిన చిత్రం '1-నేనొక్కడినే'. మోడల్ కృతిసనన్ హీరోయిన్ గా నటించింది. మహేష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించగా సుకుమార్ దర్శకత్వం వహించాడు. ఫస్ట్ టైమ్ దేవిశ్రీ ప్రసాద్ మహేష్ సినిమాకు సంగీతం సమకూర్చాడు. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నా క్లాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

  Mahesh Babu’s ‘1, Nenokkadine’ to release in Malayalam

  ఇండస్ట్రీ మొత్తం నుంచి ఈ సినిమాకి బాగా సపోర్ట్ వచ్చింది. ఎన్నో కాల్స్ వచ్చాయి. రవితేజ, రామ్, నాని సహా చాలా మంది హీరోలు, రాజమౌళి, పూరి జగన్నాథ్, సురేందర్‌రెడ్డి సహా చాలా మంది డైరెక్టర్లు, చోటా కె. నాయుడు వంటి టెక్నీషియన్లు సినిమా చాలా బాగుందంటూ ప్రశంసించారు. ప్రస్తుతం జర్మన్, ఫ్రెంచి భాషల్లో డబ్బింగ్ చేసే ప్రక్రియ నడుస్తోంది. ఆ తర్వాత మరికొన్ని ప్రపంచ భాషల్లో డబ్ చేయబోతున్నాల్లో ఉన్నారని తెలుస్తోంది. మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ ఈ సినిమాతో తెరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రను గౌతమ్ పోషించారు.

  కథ మరోసారి గుర్తు చేసుకుంటే...

  గౌతమ్(మహేష్)...చిన్నప్పుడే తల్లితండ్రులను కోల్పోతాడు. తన తల్లి తండ్రులను ముగ్గురు చంపారని గుర్తుపెట్టుకుంటాడు..కాని వాళ్లు ఎవరు..ఎందుకు చంపారు అనేది మాత్రం తెలియకుండానే పెరిగి పెద్దవుతాడు. తన తల్లి తండ్రుల ముఖాలు మర్చిపోతాడు కానీ వారిని చంపిన వారిని మాత్రం ప్రతీ క్షణం తలుచుకుంటూ రాక్ స్టార్ గా ఎదుగుతాడు. ఎదుగుదలతో పాటు తన తల్లి తండ్రి ఎవరు అనే విషయం తెలుసుకోవాలనే కోరిక పెరిగి పెద్దవుతుంది...అంతేకాదు..వారిని చంపిన వారిపై పగ తీర్చుకోవాలనే నిర్ణయించుకుంటాడు. ఈ లోగా అతినిపై దాడులు మొదలువుతాయి..ఈ క్రమంలో గౌతమ్ తల్లి తండ్రులు ఎవరనేది ఎలా తెలుసుకున్నాడు..తన పగ ఎలా తీర్చుకున్నాడనేది మిగతా కథ.

  మహేష్ సరసన కృతి షానన్ నటించిన ఈ చిత్రంలో సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఛాయాగ్రహణం: రత్నవేలు, పోరాటాలు: పీటర్‌ హెయిన్స్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి

  English summary
  Mahesh Babu starrer psychological thriller ‘1 Nenokkadine’ will now be releasing in Malayalam as ‘1 Oruththam’ on 6th February.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X