Just In
- 5 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 6 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 6 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 6 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
మెజార్టీ ఉంటే ప్రజలను చంపాలని కాదు.. మోదీపై దీదీ గుస్సా..
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సరిలేరు నీకెవ్వరు తొలిరోజు వసూళ్లు: దుమ్ముదులిపేసిన బొమ్మ.. బాగా ఆడిందిలే!!
టాలీవుడ్ టాప్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్ సినిమాలతో సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఆ ఫామ్ కంటిన్యూ చేస్తూ 'సరిలేరు నీకెవ్వరు' ద్వారా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా ప్రీమియర్స్ తోనే సూపర్ సక్సెస్ టాక్ తెచ్చుకొని తొలిరోజు మంచి వసూళ్లు రాబట్టింది. వివరాల్లోకి పోతే..

క్లాస్, మాస్ సెంటర్స్.. ఎక్కడా తగ్గదే లేదు
సూపర్ స్టార్ మహేష్ బాబు అభినయం క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంది. అనిల్ రావిపూడి స్టైల్ ఆఫ్ కామెడీ ఫ్యామిలీ ప్రేక్షకుల మనసు దోచుకుంది. దీంతో అన్ని ఏరియాల్లో ఈ సినిమా భారీ డిమాండ్ కనిపించింది. ముఖ్యంగా మాస్ సెంటర్స్‌లో ఈ బొమ్మ దుమ్ముదులిపేసింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలిరోజే..
నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లుగా 'సరిలేరు నీకెవ్వరు'తో థియేటర్స్‌లో బొమ్మ దద్దరిల్లిపోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటిదాకా అందిన రిపోర్ట్స్ ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలిరోజే ఈ సినిమా 35 కోట్ల రూపాయలు రాబట్టినట్లు తెలుస్తోంది.

పట్టు బిగించిన మహేష్..
ముఖ్యంగా గుంటూరు, కృష్ణ, నెల్లూరు జిల్లాల్లో సాలిడ్ కలెక్షన్లు రాబట్టి మహేష్ పట్టుబిగించినట్లు తెలుస్తోంది. నెల్లూరులో ఈ సినిమా 1,27,09,211 రాబట్టి.. అక్కడ తొలిరోజు మహేష్ కెరీర్‌లో బెస్ట్ కలెక్షన్ రికార్డు సొంతం చేసుకుంది. కృష్ణా జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపించింది.

ప్రపంచవ్యాప్తంగా, ఓవర్సీస్ మార్కెట్‌లో..
ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే 'సరిలేరు నీకెవ్వరు' సినిమా 47 కోట్లు రాబట్టినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో దుమ్ముదులిపేసింది ఈ మూవీ. అమెరికాలో 294 సెంటర్లలో విడుదలైన ఈ సినిమా 759,973 డాలర్స్ రాబట్టినట్లు సినీ విశ్లేషకులు తరం ఆదర్శ్ తెలిపారు.
|
బ్లాక్‌బస్టర్ పార్టీ.. సరిలేరు నీకెవ్వరు టీమ్
తొలిరోజు సరిలేరు నీకెవ్వరు స్పందన, కలెక్షన్స్ రిపోర్ట్స్ చూసిన చిత్రయూనిట్ బ్లాక్‌బస్టర్ పార్టీ చేసుకుంది. ఈ మేరకు ఆ ఫోటో షేర్ చేస్తూ ''సెలెబ్రేషన్స్ మొదలయ్యాయి'' అని పేర్కొన్నారు మహేష్ బాబు. ఈ పార్టీలో చిత్రయూనిట్‌తో పాటు మహేష్ సతీమణి నమ్రత, కూతురు సితార కూడా పాల్గొన్నారు.