twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కలెక్షన్స్ ఒక్కసారిగా జంప్: రెండో రోజు ఆశ్చర్య పరిచిన ‘మణికర్ణిక’ వసూళ్లు!

    |

    కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మణికర్ణిక' చిత్రం తొలి రోజు బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచింది. ఝాన్సీ రాణి లక్ష్మీభాయి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ ఫస్ట్ డే ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ సాధించలేదు.

    అయితే ఈ చిత్రానికి రివ్యూలు అనుకూలంగా రావడం, ప్రేక్షకుల నుంచి కూడా పాజిటివ్ మౌత్ టాక్ రావడం... జనవరి 26 హాలిడే తోడవ్వటంతో రెండో రోజు కలెక్షన్ల గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఫస్ట్ వీకెండ్(ఆదివారం) పూర్తయ్యే సమయానికి వసూళ్లు రూ. 40 కోట్ల మార్కును క్రాస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

    రెండు రోజుల్లో ఎంత వసూలు చేసింది

    రెండు రోజుల్లో ఎంత వసూలు చేసింది

    తొలి రోజు ‘మణికర్ణిక' ఇండియన్ బాక్సాఫీసు వద్ద హిందీ, తెలుగు, తమిళం వెర్షన్లు కలిపి కేవలం రూ. 8.75 కోట్లు మాత్రమే రాబట్టింది. అయితే రెండో రోజైన శనివారం రూ. 18.10 కోట్ల రావడం అందరినీ ఆశ్చర్య పరిచింది. దీంతో 2 డేస్ టోటల్ రూ. 26.85 కోట్లకు చేరుకుంది.

    ‘మణికర్ణిక-ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' రివ్యూ, రేటింగ్‘మణికర్ణిక-ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' రివ్యూ, రేటింగ్

    సరికొత్త రికార్డ్

    సరికొత్త రికార్డ్

    లేడీ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం సింగిల్ డే రూ. 18.10 కోట్లు సాధించడం బాలీవుడ్లో చాలా అరుదు. గతంలో కంగనా నటించిన ‘తను వెడ్స్ మను రిటర్న్స్' చిత్రం ఓపెనింగ్ సండే రూ. 15.85 కోట్లు రాబట్టింది. మణికర్ణిక ద్వారా కంగనా తన సినిమా రికార్డును తనే బద్దలు కొట్టింది.

    సేఫ్‌గా బయట పడుతుందా?

    సేఫ్‌గా బయట పడుతుందా?

    మణికర్ణిక చిత్రాన్ని దాదాపు రూ. 125 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో సినిమా సేఫ్‌గా బయటపడుతుందని అంచనా వేస్తున్నారు. ఆదివారంతో కలుపుకుంటే ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ రూ. 40 కోట్ల నుంచి రూ. 45 కోట్ల మార్కును అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

    తెలుగులోనూ మంచి స్పందన

    తెలుగులోనూ మంచి స్పందన

    క్రిష్ దర్శకత్వం వహించిన చిత్రం కావడం, బాహుబలి రైటర్ విజయేంద్రప్రసాద్ కథ అందించడం... సినిమాపై పాజిటివ్ టాక్ రావడంతో ‘మణికర్ణిక' చిత్రానికి తెలుగు బాక్సాఫీసు వద్ద మంచి స్పందన వస్తోంది. బాక్సాఫీసు బరిలో హిట్ చిత్రాలు లేక పోవడం కూడా కలిసొచ్చే అంశమే.

    English summary
    Trade analyst Taran Adarsh reported, “Manikarnika sees remarkable growth on Day 2... Strong word of mouth has come into play, while #RepublicDay holiday has given the much-required boost... Day 3 will be in double digits again... Fri 8.75 cr, Sat 18.10 cr. Total: ₹ 26.85 cr. India biz. #Hindi #Tamil #Telugu.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X