Don't Miss!
- News
వందే భారత్‌ను తలదన్నే `హైడ్రోజన్ రైళ్లు` రానున్నాయ్: ఏపీలో ట్రయల్స్: రద్దీ మార్గాల్లో..!!
- Sports
భవిష్యత్తులో మూడు జట్లు.. టీమిండియాపై మాజీ లెజెండ్ కామెంట్స్
- Finance
Adani Group: శుభవార్త చెప్పిన గౌతమ్ అదానీ..! త్వరలోనే ప్రారంభం కానున్న 5 IPOలు..
- Automobiles
రేపటి నుంచి ప్రారంభం కానున్న 'మిహోస్' బుకింగ్స్.. డెలివరీలు ఎప్పుడంటే?
- Lifestyle
Weekly Horoscope22.01.2023-28.01.2023 - ఈ వారం ఈ రాశుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి...
- Technology
Infinix నుంచి కొత్త ప్రీమియం ల్యాప్‌టాప్! ధర ,స్పెసిఫికేషన్లు చూడండి !
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
Matti Kusthi Day 1 Collections నిర్మాతగా రవితేజ మూవీకి షాకింగ్ కలెక్షన్లు.. మాస్ మహారాజా ఎంత రాబట్టాడంటే?
దక్షిణాదిలో స్టార్ హీరోలు రవితేజ, విష్ణు విశాల్ నిర్మాతలుగా మారి ఆర్టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందించిన చిత్రం మట్టి కుస్తీ. ఐశ్వర్య లక్ష్మీ, శత్రు, అజయ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం డిసెంబర్ 2 తేదీన తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది. ఫన్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద ముందుకెళ్తున్నది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..

తెలుగు, తమిళ భాషల్లో
విష్ణు విశాల్ నటించిన మట్టి కుస్తీ (తమిళంలో గట్టా కుస్తీ) చిత్రం దాదాపు 25 కోట్ల వ్యయంతో తెరకెక్కించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బిజినెస్ వివరాల్లోకి వెళితే.. ఏపీ, తెలంగాణలో 2.5 కోట్ల మేర వాల్యూ వేశారు. తమిళనాడులో 15 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్మారు. యూఎస్ఏ రైట్స్ 3 కోట్లకు అమ్మినట్టు తెలిసింది.

ఏపీ, తెలంగాణలో థియేటర్ కౌంట్
మట్టి కుస్తీ (గట్టా కుస్తీ) థియేటర్ కౌంట్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో భారీగానే రిలీజ్ చేశారు. నైజాంలో 90 థియేటర్లు, సీడెడ్‌లో 40 థియేటర్లు, ఆంధ్రాలో 120 థియేటర్లలో రిలీజ్ చేశారు. మొత్తంగా నైజాం, ఆంధ్రాలో కలిపి ఈ సినిమాను 250 స్క్రీన్లలో విడుదల చేశారు.

తమిళనాడులో స్క్రీన్ కౌంట్
ఇక తమిళ వెర్షన్ గట్టా కుస్తీ సినిమాను కూడా భారీ రేంజ్‌లో రిలీజ్ చేశారు. తమిళనాడు వ్యాప్తంగా ఈ సినిమాను 320కిపైగా స్క్రీన్లలో విడుదల చేశారు. ఈ సినిమాకు తమిళనాడులో మోస్తారు ఆక్యుపెన్సీ కనిపించింది. తమిళనాడులోని ప్రధాన నగరాల్లో దాదాపు 30 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదైంది.

తొలి రోజు నైజాం, ఏపీలో
మట్టి కుస్తీ (Gatta Kusthi) సినిమా విషయానికి వస్తే.. తొలి రోజు భారీగానే వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. తెలు రాష్ట్రాల్లో ఈ సినిమా 2 నుంచి 2.5 కోట్ల గ్రాస్ మేర కలెక్షన్లను రాబట్టే ఛాన్స్ కనిపిస్తున్నది. ఈ సినిమా అదే జోష్ కొనసాగిస్తే.. వారాంతంలో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఎంతంటే?
ఇక తమిళంలో విడుదలైన గట్టా కుస్తీ మూవీ భారీగానే వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమా తొలి రోజు 5 కోట్ల వరకు కలెక్షన్లను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఓవర్సీస్‌తో కలిపి సుమారు 7 కోట్ల గ్రాస్ వసూళ్లను తొలి రోజు నమోదు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.