»   » మెగా హీరోలు ముగ్గురూ ఒకేసారి...

మెగా హీరోలు ముగ్గురూ ఒకేసారి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా హీరోలు పవన్‌కల్యాణ్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ సినిమాలు ఇంచుమించు ఒకేసారి సెట్స్‌పైకి వెళ్లబోతున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలన్నీ ఈ నెలాఖరుకు గానీ వచ్చే నెల ఫస్ట్ వీక్ లో గానీ మొదలయ్యే వాతావరణం కనపడుతోంది. ఈ మేరకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. వారం వారం తేడాలో ఈ చిత్రాలు ప్రారంభోత్సవాలు జరిగే అవకాసం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమా కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకొంటున్నారు. అయితే కొన్నిసార్లు మాత్రం కథల్లో మార్పు చేర్పులు, హీరోయిన్స్ ఎంపిక తదితర పనులతో సినిమాలు ఆలస్యంగా ప్రారంభమవుతుంటాయి. పవన్‌ కల్యాణ్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్ లాంటి హీరోల కొత్త చిత్రాలు అలాంటి కారణాలతోనే ఆలస్యమయ్యాయి. అయితే వారు కూడా ఇప్పుడు ముహూర్తం సెట్‌ చేశారు. రాబోయే రోజుల్లో ఈ భారీ చిత్రాలన్నీ ప్రారంభం కాబోతున్నాయి.

Mega Hero’s Films In 2014

అల్లు అర్జున్‌ కూడా కొత్త సినిమా కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. 'జులాయి' కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఆ చిత్రం ఏ క్షణంలోనైనా సెట్స్‌ పైకి వెళ్లే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. త్రివిక్రమ్‌ ఇప్పటికే కథని సిద్ధం చేశాడని సమాచారం.

పవన్‌కల్యాణ్‌ 'అత్తారింటికి దారేది' ప్రేక్షకుల ముందుకొచ్చి చాలా రోజులైంది. ఇటీవలే అభిమానులు ఆ సినిమా వంద రోజుల వేడుక కూడా చేసుకొన్నారు. అయితే ఆయన కొత్త సినిమా 'గబ్బర్‌సింగ్‌2' మాత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. 'అత్తారింటికి దారేది' సెట్స్‌పై ఉన్నప్పట్నుంచే రెండో గబ్బర్‌సింగ్‌ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి.

అయినా పనులు తెమల్లేదు. కథానాయిక ఎంపిక పూర్తి కాకపోవడంతోనే ఈ సినిమా ఆలస్యమైందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ నెలాఖరులోగానీ, వచ్చే నెలలోగానీ ఆ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చిత్రబృందం నిర్ణయించుకొన్నట్టు తెలిసింది. సంపత్‌ నంది దర్శకత్వం వహించబోతున్నారు.

రామ్‌చరణ్‌ కూడా సినిమా సెట్‌లోకి అడుగు పెట్టక చాలా రోజులైంది. 'తుఫాన్‌' తర్వాత ఆయన పూర్తిగా కుటుంబానికే సమయం కేటాయించారు. ఇప్పుడు కృష్ణవంశీ దర్శకత్వంలో నటించడానికి చరణ్‌ సిద్ధమయ్యారు. ఇందులో శ్రీకాంత్‌ ఓ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. ఫిబ్రవరి 6న సినిమా చిత్రీకరణ ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ చిత్రం కోసం చరణ్‌, శ్రీకాంత్‌ జుట్టు పెంచే పనుల్లో ఉన్నారు.

English summary

 The heroes of mega family are expected to rock with their high projects in the first half of 2014. The makers of Power Star Pawan Kalyan’s ‘Gabbar Singh-2′ are planning to release on May 11th. The film directed by Sampath Nandi and produced by Sarath Marar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu