Don't Miss!
- News
అత్యాచారం కేసులో ఆశారాం బాపూను దోషిగా తేల్చిన గుజరాత్ కోర్టు
- Sports
IND vs NZ: స్టన్నింగ్ డెలివరీతో షేన్ వార్న్‌ను గుర్తు చేసిన కుల్దీప్ యాదవ్వీడియో
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Waltair Veerayya 9 Days Collections: సంక్రాంతి పుంజులా వీరయ్య వీరవిహారం.. బాక్సాఫీస్ ప్రాఫిట్స్ ఎంతంటే?
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి ఫెస్టివల్ లో ఊహించని ఒపెనింగ్స్ అందుకొని ఫెస్టివల్ తరువాత కూడా మంచి కలెక్షన్స్ అందుకోవడం విశేషం. పోటీగా నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డితో పాటు మరో రెండు తమిళ సినిమాలు వచ్చాయి. అయినా కూడా మెగాస్టార్ తన స్టామినాతో బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో ఒపెనింగ్స్ అందుకోవడం విశేషం. ఇక మొత్తంగా ఇప్పుడు వాల్తేరు వీరయ్య 9 రోజుల్లో ఎంత కలెక్షన్స్ అందుకుంది? అలాగే ఎంత లాభాల్లో కొనసాగుతోంది? అనే వివరాల్లోకి వెళితే..

వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ బిజినెస్
బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కూడా నటించాడు. దీంతో ఈ సినిమా రేంజ్ కు తగ్గట్టుగానే మార్కెట్లో మంచి బిజినెస్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 72 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవర్సీస్ లో 9 కోట్ల వరకు ధర పలికింది. ఫైనల్ గా ప్రపంచ వ్యాప్తంగా సినిమా 88 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక మొత్తంలో వాల్తేరు వీరయ్య బ్రేక్ ఈవెన్ టార్గెట్ 89 కోట్లకు ఫిక్స్ అయింది.

9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్
వాల్తేరు వీరయ్య సినిమాకు అన్ని వర్గాలు ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ టాక్ రోజురోజుకు కలెక్షన్స్ మరింత పెరుగుతూ వచ్చాయి. ఇక ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక 9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాలవారిగా ఈ సినిమా అందుకున్న కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజంలో 1.25లక్షలు, సీడెడ్ లో 27 లక్షలు, ఉత్తరాంధ్ర 95 లక్షలు, ఈస్ట్ లో 50 లక్షలు, వెస్ట్ లో 25 లక్షలు, గుంటూరులో 23 లక్షలు, కృష్ణ 24 లక్షలు, నెల్లూరులో 16 లక్షలు, షేర్ కలక్షన్స్ సొంతం చేసుకుంది. ఏపీ తెలంగాణలో మొత్తంగా ఈ సినిమా 8వ రోజు 3.85 కోట్ల షేర్ కలెక్షన్స్ 6.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.

9 రోజుల టోటల్ కలెక్షన్స్
మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమా 9 రోజుల్లో మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుకున్న కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజంలో 27.17 కోట్లు, సీడెడ్ లో 14.8 కోట్లు, ఉత్తరాంధ్రలో 12.29 కోట్లు, ఈస్ట్ లో 8.5 కోట్లు, వెస్ట్ లో 4.86 కోట్లు, గుంటూరులో 6.43 కోట్లు, కృష్ణ లో 6.16 కోట్లు, నెల్లూరులో 3.17 కోట్లు, ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 88.71 షేర్ కలెక్షన్స్ 142.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.

వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్
కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా వాల్తేరు వీరయ్య సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. అక్కడ 6.40 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఓవర్సీస్ లో కూడా ఈసారి మెగాస్టార్ తన దూకుడు చూపించారు. అక్కడ 11.5 కోట్ల షేర్ వచ్చింది. ఇక ప్రపంచవ్యాప్తంగా వాల్తేరు వీరయ్య సినిమా చాలా వేగంగా 106.72 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం. ఇక ఈ సినిమాకు 182.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

లాభాల్లోనే మెగాస్టార్ మూవీ
ఇక వాల్తేరు వీరయ్య సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే 88 కోట్ల వరకు జరిగింది. అంటే సినిమా 89 కోట్లు అందుకుంటేనే సక్సెస్ అయినట్లు లెక్క. ఇక అలాంటిది ఇప్పుడు ఈ సినిమా మొత్తం షేర్ కలెక్షన్స్ 103 కోట్లు దాటడంతో ఇప్పుడు 17.72 కోట్ల రేంజ్ లో షేర్ ప్రాఫిట్స్ తో కొనసాగుతోంది. ఇదే ఫ్లోలో కొనసాగితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మరింత లాభాలు చేకూర్చే అవకాశం ఉంది.