Mirai Day 10 Collections : 10 రోజుల్లో మిరాయ్ కలెక్షన్లు.. ఎన్ని కోట్లు వసూలైందంటే?
మిరాయ్ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంటోంది. వర్కింగ్స్ డేస్ లో కాస్తా జోరు తగ్గించినా వీకెండ్స్ ల్లో మాత్రం దుమ్ములేపుతోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో తేజా సజ్జా, యంగ్ బ్యూటీ రితికా నాయక్ హీరోహీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సూపర్ యోధా ఫిల్మ్ మిరాయ్ సెప్టెంబర్ 12న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ఈ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌ను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో ప్రముఖ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించడం విశేషం. ఈ క్రమంలో మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? 10వ రోజు వరల్డ్ వైడ్ ఎన్ని కోట్లు వసూలైందనే వివరాల్లోకి వెళ్తే..
మిరాయ్ బడ్జెట్ ఎన్ని కోట్లు?
సైంటిఫిక్ యాక్షన్ మూవీ మిరాయ్ చిత్రంలో యంగ్ టాలెంటెట్ తేజా సజ్జా, రితికా నాయక్, సినీయర్ నటులు శ్రీయా శరణ్, మంచు మనోజ్, జగపతి బాబు, జయరాం, తిరుమల కిషోర్, వెంకటేష్ మహా, గెటప్ శ్రీను ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రముఖ టెక్నీషియన్లు సినిమాటోగ్రఫీ, దర్శకత్వం కార్తీక్ ఘట్టమనేని, మ్యూజిక్ గౌర హరి, ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్ చూశారు. దీంతో నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, సినిమా నిర్మాణ ఖర్చులు, ప్రచార ఖర్చులన్నీ కలుపుకొని రూ.65 కోట్ల వరకు బడ్జెట్ ఖర్చైందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్?
తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ ద్వారా ఆంధ్రాలో రూ.8 కోట్లు, నైజాంలో రూ.7 కోట్లు, సీడెడ్‌లో రూ.3 కోట్లు, కర్ణాటకలో రూ.2 కోట్లు, తమిళనాడులో రూ.2.5 కోట్లు, కేరళలో రూ.50 లక్షలు, హిందీలో రూ.10 కోట్లు, ఓవర్సీస్ రైట్స్‌లో రూ.5 కోట్లు, నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా కలుపుకొని రూ.85 కోట్ల మేర ప్రీ రిలీజ్ వ్యాపారం అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.32 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్, రూ.64 కోట్ల గ్రాస్ వసూల్ చేయాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
మిరాయ్ 9 రోజుల వసూళ్లు..
ఓపెనింగ్ డే రూ.13 కోట్లు, 2వ రోజు రూ.15 కోట్లు, 3వ రోజు రూ.16.6 కోట్లు, 4వ రోజు రూ.6.4 కోట్లు, 5వ రోజు రూ.6 కోట్లు, 6వ రోజు రూ.4.75 కోట్లు, 7వ రోజు రూ.3.75 కోట్లు, 8వ రోజు రూ.275 కోట్లు, 9వ రోజు రూ.5.15 కోట్లు వసూల్ చేసింది. దీంతో 9 రోజుల్లో ఈ చిత్రం ఇండియా నెట్ రూ.73 కోట్లకు చేరుకుందని సాక్ నిక్ గణంకాలు తెలుపుతున్నాయి.
10వ రోజు వసూళ్లు..
2వ వీకెండ్ లో మిరాయ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి నెంబర్స్ ను సాధిస్తోంది. సెప్టెంబర్ 20న రూ.5.15 కోట్లు వసూల్ చేయగా.. 10వ రోజు సెప్టెంబర్ 21న కేవలం రెండు ఆటల నుంచే రూ.4.01 కోట్ల ఇండియా నెట్ ను వసూల్ చేసిందని సాక్ నిక్ ఏర్లీ రిపోర్ట్ లో తెలిపింది. ఇక లెక్కన మిలిగిన ఫష్ట్ షో, నైట్ షోలు కలుపుకొని మొత్తంగా రూ.8 కోట్ల వరకు ఇండియా నెట్, రూ.15 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు.
స్టేట్ వైజ్‌గా కలెక్షన్లు..
9వ రోజు వరకు మిరాయ్ చిత్రం తెలుగు స్టేట్స్ ఏపీ+తెలంగాణ కలుపుకొని రూ.58.25 కోట్లు, కర్ణాటకలో రూ.8.45 కోట్లు, తమిళనాడులో రూ.2 కోట్లు, మలయాళంలో రూ.33 లక్షలు, ROI ద్వారా రూ.16.86 కోట్లు వసూల్ చేసిందని సాక్ నిక్ బాక్సాఫీస్ రిపోర్ట్ లో పేర్కొంది.
వరల్డ్ వైడ్ గా కలెక్షన్లు..
మిరాయ్ చిత్రం 9వ రోజు అందిన కలెక్షన్లతో ఇండియా నెట్ రూ.73 కోట్లకు చేరుకుంది. ఇండియా రూ.86 కోట్ల గ్రాస్ చేరుకుంది. ఇక ఓవర్సీస్ రూ.27 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. దీంతో ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని వరల్డ్ వైడ్ గా రూ.113 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది.


Click it and Unblock the Notifications











