Mirai Day 8 Collections: మిరాయ్ బాక్సాఫీస్ జోరుకు బ్రేక్.. 8వ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
తెలుగు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మిరాయ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుస్థాయిలో వసూళ్లను రాబడుతున్నది. ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో వరుస వైఫల్యాలు చోటు చేసుకొన్న నేపథ్యంలో మిరాయ్ సినిమాకు భారీగా కలెక్షన్లు రావడం ఊరటగా మారింది. తేజా సజ్జా హీరోగా రితిక నాయక్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీన గ్రాండ్‌గా రిలీజై బాక్సాఫీస వద్ద భారీగా వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమా 8వ రోజు అంచనా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
సామ్రాట్ అశోక చక్రవర్తి కాలం నాటి కథతో ఎపిక్ సోషియో ఫాంటసీగా, ఇతిహాసాలు, పురాణాల కీలక అంశాలుగా రూపొందిన మిరాయి చిత్రంలో భారీగా యాక్షన్ సీన్లు, వీఎఫ్ఎక్స్ వర్క్‌తో గ్రాండ్‌గా నిర్మించారు. అలాగే టాప్ స్టార్ కాస్ట్, టెక్నిషియన్స్ కూడా పనిచేయడం, అలాగే రాజీ లేకుండా ఖర్చు చేయడంతో బడ్జెట్ కూడా భారీగానే అయింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. ఈ సినిమాను సుమారుగా 65 కోట్ల రూపాయలతో టాప్ క్లాస్ టెక్నికాలిటీస్‌తో, రిచ్‌గా నిర్మించారు.

మిరాయ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 8 కోట్ల రూపాయలకు, నైజాం 7 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 3 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 2 కోట్ల రూపాయలు, తమిళనాడు రైట్స్ 2.5 కోట్లు, కేరళ రైట్స్ 50 లక్షల రూపాయలు, హిందీ రైట్స్ 10 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇండియాలో మిరాయ్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 54 కోట్ల రూపాయల నెట్, హిందీలో 16 కోట్ల రూపాయల నెట్, కన్నడలో 7.5 కోట్లు, తమిళంలో 2 కోట్ల రూపాయలు, మలయాళంలో 50 లక్షల రూపాయల నికర వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా 80 కోట్ల రూపాయల నికర కలెక్షన్లను వసూలు చేసింది అని సాక్ నిక్ వెల్లడించింది. ఓవర్సీస్ విషయానికి వస్తే.. ఈ చిత్రం 24 కోట్ల రూపాయలు వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 104 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
గత 7 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాంలో 18 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 4.25 కోట్లు, ఉత్తరాంధ్రలో 3.75 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 2.25 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1.5 కోట్లు, గుంటూరు జిల్లాలో 2 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 2 కోట్ల రూపాయలు, నెల్లూరులో జిల్లాలో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 54 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టింది.
ఇక ఈ చిత్రం 8వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. గత 7 రోజులతో పోల్చుకొంటే ఈ మూవీ కలెక్షన్లు నెమ్మదించాయి. ఈ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ జోరుకు మెల్లమెల్లగా బ్రేక్ పడుతున్నది. ఇండియాలో ఈ చిత్రం సుమారుగా 1.5 నుంచి 2 కోట్ల మేర వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 2.5 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోను, అలాగే హిందీలోను బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకొన్నది. మిగితా ప్రాంతాల్లోకూడా ఈ సినిమా లాభాల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నది. రానున్న రోజుల్లో ఈ సినిమా సానుకూలమైన ఫలితాన్ని రాబట్టే అవకాశం ఉంది. OG సినిమా రిలీజ్‌కు ముందు మిరాయ్ థియేట్రికల్ రన్ ముగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











