»   »  తప్పేటట్లు లేదు: మహేష్ కు హాలీవుడ్ తలనొప్పి

తప్పేటట్లు లేదు: మహేష్ కు హాలీవుడ్ తలనొప్పి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : స్టార్ హీరోల చిత్రాలు రిలీజ్ అవుతూంటే సాధారణంగా చిన్న సినిమాలు అన్నీ అడ్డం తప్పుకుని దారి ఇస్తూంటాయి. అయితే హాలీవుడ్ డబ్బింగ్ చిత్రాలు మాత్రం వాటి రిలీజ్ మాత్రం ఆగవు. ఎందుకంటే అవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతాయి కాబట్టి. ముఖ్యంగా మనకు ఇక్కడ తెలుగులోనూ హాలీవుడ్ చిత్రాల జోరు బాగానే ఉంది. హైదరాబాద్,వైజాగ్ వంటి చోట స్ట్రైయిట్ గా హాలీవుడ్ చిత్రాలు ఆడితే, మిగతా చోట్ల ముఖ్యంగా బి,సి సెంటర్లలలో హాలీవుడ్ చిత్రాల డబ్బింగ్ లు సొమ్ము చేసుకుంటున్నాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


దాంతో ఎగ్జిబిటర్స్ ఆ చిత్రాలను తమ ధియోటర్స్ లో ప్రదర్శించటానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అవి ఒక్కోసారి పెద్ద సినిమాలకు పోటీ ఇస్తున్నాయి. తాజాగా మహేష్ బాబు..శ్రీమంతుడు చిత్రానికి అలాంటి సమస్యే ఎదురుకానుందని సమాచారం. శ్రీమంతుడు చిత్రానికి ఒక రోజు ముందు అంటే ఆగస్టు 6న హాలీవుడ్‌ యాక్షన్‌ చిత్రం 'మిషన్‌: ఇంపాజిబుల్‌-రోగ్‌ నేషన్‌' రిలీజ్ అవుతోంది. దాని డబ్బింగ్ వెర్షన్ సైతం తెలుగులో భారీ ఎత్తున విడుదల అవటం విశేషం.


“Mission Impossible: Rogue Nation” trouble for “Srimanthudu”

మిషన్ ఇంపాజిబుల్-రోగ్ నేషన్ టామ్ క్రూజ్ హీరోగా నటించిన ఈ సిరీస్‌లో ఇప్పటిదాకా వచ్చిన నాలుగు భాగాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ముఖ్యంగా నాలుగో భాగం 'ఘోస్ట్ ప్రొటోకాల్' కనకవర్షం కురిపించింది. త్వరలో ఐదో భాగం రాబోతోంది. 'రోగ్ నేషన్' టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని టామ్‌క్రూజ్, జె.జె. అబ్రమ్స్, బ్రియాన్ బర్క్ కలిసి నిర్మిస్తున్నారు.


క్రిస్టొఫర్ మెక్‌క్వారీ దర్శకుడు. రెబెకా ఫెర్గూసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎప్పటి లాగే ఈ చిత్రం కోసం ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాల్లో టామ్ క్రూజ్ నటించారు. విమానం మీద చేసిన యాక్షన్ సీక్వెన్స్ ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారాయి.


మరో ప్రక్క హాలీవుడ్‌ యాక్షన్‌ చిత్రం 'మిషన్‌: ఇంపాజిబుల్‌-రోగ్‌ నేషన్‌' ప్రచార కార్యక్రమం జోరు పెంచారు. తాజాగా ఈ ప్రమోషన్.. జపాన్‌లోని టోక్యోలో జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర హీరో టామ్‌క్రూజ్‌, దర్శకుడు క్రిస్టొఫర్‌ మెక్‌క్వారీ హాజరయ్యారు. టోహో సినిమాస్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చిత్ర కథానాయకుడు, దర్శకుడితో ఫొటోలు దిగేందుకు వారు పోటీ పడ్డారు.


“Mission Impossible: Rogue Nation” trouble for “Srimanthudu”

'శ్రీమంతుడు' విషయానికి వస్తే..


హైదరాబాద్‌: మహేష్ బాబు, శ్రుతిహాసన్‌ జంటగా మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'శ్రీమంతుడు'. సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎలాంటి కట్స్‌ లేకుండా క్లీన్‌ యూ బై ఏ ధ్రువీకరణ పత్రం పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 7న శ్రీమంతుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.


జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం. ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి, కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.

English summary
On August 7th Mahesh Babu’s “Srimanthudu” is coming, while on August 6th there is the release of Tom Cruise’s “Mission Impossible: Rogue Nation” set to hit Indian cinemas.
Please Wait while comments are loading...