»   » ఎంఎస్.ధోనీ... ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు అదిరిపోయాయి!

ఎంఎస్.ధోనీ... ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు అదిరిపోయాయి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితం ఆధారంగా తెరకెక్కించిన బయోపిక్ 'ఎంఎస్.ధోనీ-ది అన్ టోల్డ్ స్టోరీ' కి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు(శుక్రవారం) రూ. 21.30 కోట్లు వసూలు చేసిన ఈచిత్రం...వీకెండ్(శని, ఆది) రోజుల్లో అదరగొట్టింది.

సినిమా విడుదలైన (ఫస్ట్ వీకెండ్) తొలి మూడు రోజుల్లో ఈ చిత్రం రూ. 66 కోట్లు వసూలు చేసింది. మొదటి రోజు రూ. 21.30 కోట్లు వసూలు చేయగా... రెండో రోజు కాస్త తగ్గి రూ. 20.60 కోట్లు వసూలు చేసింది. సినిమా పాజిటివ్ టాక్ ఉండటంతో ఆదివారం రూ. 24.10 కోట్లు వసూలు చేసింది.

త్వరలో 100 కోట్లు

త్వరలో 100 కోట్లు

సెకండ్ వీకెండ్ లోపే ఈ సినిమా రూ. 100 కోట్ల మార్కును ఈజీగా అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఫుల్ రన్ లో ఈ చిత్రం రూ. 200 కోట్లను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని, అంతకంటే ఎక్కువ కూడా వసూలు చేసే అవకాశం ఉంది అంటున్నారు.

ఈ ఏడాది వీకెండ్ టాప్ ఏది?

ఈ ఏడాది వీకెండ్ టాప్ ఏది?

ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ మూవీ వీకెండ్ కలెక్షన్ల విషయంలో టాపులో ఉంది. మిడ్ వీక్ లో రిలీజైన్ ఈచిత్రం తొలి వీకెండ్(5 రోజులు) రూ. 180 కోట్లు వసూలు చేసింది.

ఎంఎస్ ధోనీ

ఎంఎస్ ధోనీ

ఈ ఏడాది విడుదలైన సుల్తాన్ తో పాటు హౌస్ ఫుల్ 3, ఫ్యాన్, రుస్తుం తొలి వీకెండ్ రూ. 50 కోట్ల మార్కను దాటేసాయి. తాజాగా ఎంఎస్ ధోనీ కూడా ఆ మార్కును అందుకున్న ఐదో సినిమాగా నిలిచింది.

దక్షిణాదిలో కూడా..

దక్షిణాదిలో కూడా..

సాధారణంగా బాలీవుడ్ సినిమాలు సౌత్ లో పెద్దగా ఆడవు. అయితే క్రికెట్ గా ధోనికి మంచి క్రేజ్ ఉండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇతర సౌతిండియా స్టేట్స్ లో కూడాఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తోంది.

English summary
Continuing its dream run at box office, 'MS Dhoni: The Untold Story' packs a solid total for its first week run. While the movie raked Rs 21.30 Cr on Friday and Rs 20.60 on Saturday, it was phenomenal on Sunday with 24.10 cr. Total for the first weekend is Rs 66 Cr.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu