»   »  నాగార్జున ‘ఓం నమో వెంకటేశాయ’ ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్

నాగార్జున ‘ఓం నమో వెంకటేశాయ’ ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వెంకటేశాయ'.

సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి అందిస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున హాథీరామ్‌ బాబాగా మరో అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారు.


జగపతిబాబు, అనుష్క, ప్రగ్యాజైస్వాల్‌, మధురిమ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియోను జనవరి 8న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని నాగార్జున ఫేస్‌బుక్‌, ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఇక దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తనదైన శైలిలో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా 'ఓం నమో వెంకటేశాయ' చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రాన్ని పిభ్రవరి 10న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


ఈ చిత్రంలో వేంకటేశ్వరస్వామిగా సౌరబ్‌జైన్‌ నటిస్తుండగా, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క కనిపించనుంది. శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, అనుష్క శెట్టి, సౌరబ్‌ జైన్‌, జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్‌, విమలా రామన్‌, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌, ప్రభాకర్‌, రఘుబాబు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.


Nag's Om Namo Venkatesaya audio launch date

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రూపొందిస్తున్న ఈ చిత్రానికి స్వరవాణి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్‌.గోపాల్‌రెడ్డి, జె.కె.భారవి, కిరణ్‌కుమార్‌ మన్నె, గౌతంరాజు ఇతర సాంకేతిక వర్గం.


English summary
In a special Twitter video, Nagarjuna said " Hi everyone, wishing you a merry happy Christmas and thank you for the awesome response for the teaser of Om Namo Venkatesaya. We got a total sum of 2 million views on digital media in just 24 hours, That's great and I am so excited to announce the audio launch date of Om Namo Venkatesaya on January 8th and have a great Sunday".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu