»   »  'ఓం నమో వెంకటేశాయ' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ నిరాశే, నష్టం తప్పదా..ఎంత రావాలి

'ఓం నమో వెంకటేశాయ' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ నిరాశే, నష్టం తప్పదా..ఎంత రావాలి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'శిరిడిసాయి' చిత్రాల తర్వాత రాఘవేంద్రరావు-నాగార్జున కలయికలో వచ్చిన చిత్రమిది. ముఖ్యంగా వేంకటేశ్వరస్వామికి పరమ భక్తుడైన హథీరాం బాబాజీ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాను తీస్తే రాఘవేంద్రరావే తీయాలి.. చేస్తే నాగార్జునే చేయాలి అన్నట్టుగా ఆ ఇద్దరూ భక్తి ప్రధానమైన చిత్రాలపై ఓ ప్రత్యేకమైన ముద్రవేశారు.

దాంతో 'ఓం నమో వేంకటేశాయ'కి కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే అంచనాలు షురూ అయ్యాయి. సినిమా రిలీజైంది. ఆ మేజిక్‌ మరోసారి తెరపై కనిపించిందంటూ పాజిటివ్ రివ్యూలు అంతటా వచ్చాయి. శ్రీవారి భక్తుడు 'అన్నమయ్య'గా ఒదిగిపోయిన నాగార్జున, హథీరాం బాబాగా అద్బుతంగా నటించారని అంతా మెచ్చుకున్నారు. అయినప్పటికీ 'ఓం నమో వేంకటేశాయ' బాక్సాఫీస్ వర్కవుట్ అయ్యే పరిస్దితి కనపడటం లేదు.


మొదటి రోజు వసూళ్లే కాదు.. ఫస్ట్ వీకెండ్ వసూళ్లు కూడా అంచనాల్ని అందుకోలేదు. ఫస్ట్ వీకెండ్లో ఈ చిత్రం రూ.7 కోట్ల లోపే షేర్ కలెక్ట్ చేసింది. మూడు రోజుల్లో రూ.6.5 కోట్ల షేర్ తో అంచనాలుకు దూరంగా నిలిచి షాకిచ్చింది. రెండు.. మూడు రోజుల్లో కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి కానీ.. పెరగకపోవటంతో అందోళనగా మారింది. రూ.40 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం కు ఇదే పరిస్దితి కంటిన్యూ అయితే . బయ్యర్లకు భారీ నష్టాలు తప్పేలా లేవు అని ట్రేడ్ లో లెక్కలు వేస్తున్నారు.


Nag's 'Om Namo Venkatesaya' first weeked collections

ఫస్ట్ వీకెండ్ ... ఏరియాల వారీగా 'ఓం నమో వేంకటేశాయ' షేర్ బ్రేకప్స్ ఎలా ఉన్నాయంటే..


నైజాం (తెలంగాణ)- రూ.1.88 కోట్లు


సీడెడ్ (రాయలసీమ)-రూ.80 లక్షలు


వైజాగ్ (ఉత్తరాంధ్ర)- రూ.60 లక్షలు


గుంటూరు-రూ.56 లక్షలు


కృష్ణా-రూ.29 లక్షలు


తూర్పు గోదావరి-రూ.36లక్షలు


పశ్చిమ గోదావరి-రూ.37 లక్షలు


నెల్లూరు-రూ.24 లక్షలు


ఏపీ-తెలంగాణలో కలిపి- రూ.5.1 కోట్లు


కర్ణాటక- రూ.91 లక్షలు


మిగతా ఏరియాలన్నీ కలిపి- రూ.45 లక్షలు


మొత్తం-రూ.6.5 కోట్లుచిత్రం కథేమిటంటే...


16 శతాబ్దానికి చెందిన రామ్ (నాగార్జున) చిన్నతనం నుంచీ దేవుడిని చూడాలనే కోరికతో జ్వలిస్తూంటాడు. దేవుడిని చూసే విద్య నేర్చుకోవాలంటూ చిన్నతనంలోనే ఇంట్లోంచి బయిటకు వచ్చి...తిరుమలలోని గురువు పద్మానంద స్వామి (సాయికుమార్) నడుపుతున్న వేద పాఠశాలలో చేరుతాడు. అక్కడే విద్య అభ్యసిస్తూ..ఆయన చెప్పిన మాటతో తపస్సుకు సైతం పూనుకుంటాడు.


రామ్ చేసే తపస్సుకు మెచ్చిన శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రత్యక్షమవుతాడు. కానీ దేవుడ్ని అప్పుడు గుర్తించలేకపోతాడు. తర్వాత తనకు కనిపించింది దేవుడే అని తెలుసుకుని మళ్ళీ దేవుని చెంతకు వెళ్లాలని ప్రయత్నిస్తాడు. కానీ అక్కడున్న కొంతమంది వలన దేవుడిని చేరుకోలేకపోతాడు. ఆ క్రమంలోనే మరో వెంకటేశ్వర సామి భక్తురాలు కృష్ణమ్మ (అనుష్క) ను కలుస్తాడు. ఆమెతో కలిసి తిరుమల క్షేత్రంలో జరుగుతున్న అన్యాయాలను అడ్డుకుని, క్షేత్రాన్ని వైకుంఠంగా అభివృద్ధి చేస్తూంటాడు. అతని భక్తికి ముగ్దుడైన వెంకటేశ్వర స్వామి మరోసారి అతనికి దగ్గరై అత్యంత ఆప్తుడిగా మారిపోతాడు.


తిరుమలలో ఆలయ అధికారి గోవిందరాజులు(రావు రమేష్‌) ఆగమ శాస్త్రం ప్రకారం స్వామి విధులు నిర్వర్తించటం లేదని రామ ప్రశ్నిస్తాడు. దాంతో గోవిందరాజులు... రామపై ఎందుకు కక్ష కడతాడు. మరో ప్రక్క రామను పరీక్షించాలని స్వామి నిర్ణయించుకుంటాడు. ఆ ప్రయత్నంలో రామ జీవితంలో రకరకాల అనుభవాలు ఎదురవుతాయి. రామ యొక్క భక్తి శ్రద్దలు చూసిన స్వామివారు...మొదట ఆయన కలలోనూ ఆ తర్వాత నిజ జీవితంలోనూ కనపడతారు.


అంతేకాకుండా రామతో పాచికలు ఆడతారు. అలా రామా వద్ద స్వామి వారు పాచికల పందెంలో తన నగలు మొత్తం ఓడుతారు. అదే సమయంలో స్వామి వారి నగల దొంగతనం గుడిలో జరుగుతుంది. దేవాలయ అధికారులు దృష్టి, అనుమానం రామ వారిపై పడుతుంది. ఆ క్రమంలో రామా నివాసం ఉంటున్న ఆశ్రమం పై ఆ నగల కోసం దాడి చేస్తారు. అక్కడ ఆ ఆశ్రమంలో రామ వద్ద స్వామి వారి నగలు దొరుకుతాయి.


దాంతో అప్పటి రాజు...రామాని ..ఖైదు చేయమని ఆజ్ఞాపిస్తాడు. ఈ స్వామి భక్తుడు కథలో భవానీ (ప్రగ్యాజైస్వాల్‌) పాత్రేంటి? రామ కోసం ఆమె చేసిన త్యాగం ఎలాంటిది? అసలు ...రామ.. హథీరాం బాబాగా ఎలా మారాడు? స్వామి వారి చేతుల మీదుగానే సజీవ సమాధి ఎలా అయ్యాడు? తదితర విషయాల్ని తెలుసుకోవాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే.బ్యానర్: ఎ.ఎం.ఆర్‌. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి.
నటీనటులు: నాగార్జున.. సౌరభ్‌జైన్‌.. అనుష్క.. ప్రగ్యాజైస్వాల్‌.. జగపతిబాబు.. విమలారామన్‌.. అస్మిత.. రావు రమేష్‌.. వెన్నెల కిషోర్‌.. ప్రభాకర్‌.. రఘుబాబు తదితరులు
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
ఛాయాగ్రహణం: ఎస్‌.గోపాల్‌రెడ్డి
కథ, మాటలు: జె.కె.భారవి
నిర్మాత: మహేశ్‌రెడ్డి
దర్శకత్వం: రాఘవేంద్రరావు

English summary
Nagarjuna's Devotional movie, Om Namo Venkateshaya got good Positive talk right from the first show from movie lovers and critics. But then the first dayopenings are not on par with the talk which is anyways expected for a devotional film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu