»   »  'సోగ్గాడే చిన్ని నాయనా' ఆడియో లాంచ్ డేట్

'సోగ్గాడే చిన్ని నాయనా' ఆడియో లాంచ్ డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ... 'సోగ్గాడే చిన్ని నాయనా'. సంక్రాంతి కానుకగా జనవరి 15న మన ముందుకు రానున్న ఈ చిత్రం ఆడియోని డిసెంబర్ 25న విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ ఆడియోని విడుదల చేస్తున్నారు. అక్కినేని అభిమానులు ఈ వేడుకకు భారిగా తరలి రానున్నారు.

Soggade Chinni Nayana Audio Release On Dec 25


Posted by Akkineni Nagarjuna on 22 December 2015

ఈ చిత్రంలో రాము అనే పాత్రలో చాలా ఎంజాయ్‌ చేశానని నాగార్జున అన్నారు. ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో కొడుకు పాత్ర పేరే రాము. దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ ఈ పాత్రని చాలా భిన్నంగా, ఆసక్తికరంగా రూపొందించారని నాగార్జున అన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆ వీడియోని ఇక్కడ చూడండి.ఈ పాత్ర గురించి నాగార్జున మాట్లాడుతూ.. సినిమాలో రాము ఒక డాక్టర్‌. చాలా తెలివైనవాడు. అయితే అతనికి వేషభాషల గురించి ఏ మాత్రం తెలియదు. జుట్టు దువ్వుకోవడం, సరిగా చొక్కా వేసుకోవడం.. ఏవీ తెలియవు. అంతే కాదు చిన్న చిన్న వాడుక పదాలకి కూడా గూగుల్‌లో అర్థాలు వెదుకుతుంటాడని, ఈ పాత్రలో నటించే సమయంలో చాలా ఎంజాయ్‌ చేశానని అన్నారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తూ...వినోదం, కుటుంబ అనుబంధాల సమాహారంగా తెరకెక్కుతున్న చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా' . ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా విడుదలై నాగార్జున అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆ ట్రైలర్ మీరు ఇక్కడ చూడండి.రమ్యకృష్ణ, లావణ్యత్రిపాఠి హీరోయిన్స్. వినూత్న కథాంశంతో గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున తండ్రి, కొడుకుగా ద్విపాత్రాభినయంలో కనిపిస్తున్నరు. రెండు పాత్రలు సరికొత్త పంథాలో సాగుతాయని చిత్ర యూనిట్ చెబుతోంది.


Nag's Soggade Chinni Nayana audio launch on Dec 25

లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం స్వామిజీగా వినోదం పండిస్తారని సమాచారం. హంసానందిని, అనసూయ , చలపతిరావు, వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా' నిర్మాత రామ్మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.

English summary
Soggade Chinni Nayana will have its audio launch on the 25th of December. The audio launch will be held in a grand manner at the Shilpa Kala Vedika in Hyderabad.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu