»   »  నాగశౌర్య ‘కళ్యాణ వైభోగమే’ టీజర్ ఎప్పుడంటే...

నాగశౌర్య ‘కళ్యాణ వైభోగమే’ టీజర్ ఎప్పుడంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగశౌర్య, ‘అలా మొదలైంది' ఫేమ్ నందిని రెడ్డి కాంబినేషన్ లో ‘కళ్యాణ వైభోగమే' అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దాదుపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

Naga Shourya 's Kalyana Vaibhogame’s teaser on Diwali

ఈ నేపధ్యంలో ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ టీజర్‌ను ఇప్పటికే దాదాపుగా సిద్ధం చేసేశామని, త్వరలోనే వీటిని రిలీజ్ చేస్తామని నందిని రెడ్డి తెలియజేశారు. దీపావళి కానుకగా ఫస్ట్‌లుక్, టీజర్‌ను విడుదల చేస్తారని సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

‘అలామొదలైంది' చిత్రంతో దర్శకురాలిగా పరిచయమైన నందినిరెడ్డి మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకుంది. తర్వాత సిద్దార్థ్, సమంత జంటగా నటించిన ‘జబర్ధస్త్' చిత్రం డైరెక్ట్ చేసిని నందినికి ఆశించిన ఫలితం దక్కలేదు సరికదా...మరో సినిమా రావడానికి రెండు సంవత్సరాల సమయం పట్టింది.

Naga Shourya 's Kalyana Vaibhogame’s teaser on Diwali

ఇటీవల వరుస సినిమాలతో దూకుడు మీదున్న యంగ్ హీరో నాగశౌర్యతో ఓ చిత్రం ప్రారంభించింది నందిని. దాదాపు 70శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘కళ్యాణ వైభోగమే' అనే టైటిల్‌ను ఎంపిక చేశారు. సినిమాకు టైటిల్స్ పెట్టే విషయంలో నందినిరెడ్డి స్టైలే వేరని ఈ ‘కళ్యాణ వైభోగమే' టైటిల్‌తో మరోసారి నిరూపించుకుంది. ఈ చిత్రంలో నాగశౌర్య సరసన ‘ఎవడే సుబ్రమణ్యం' ఫేం మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది.

English summary
According to the latest update, Naga Sourya's Kalyana Vaibhogame first look teaser will be revealed on the eve of Diwali.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu