twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Akhanda 11days Collections: 11వ రోజు చరిత్ర సృష్టించిన బాలయ్య.. దెబ్బకు రెండో స్థానానికి చేరిన అఖండ

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లపై ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఫలానా హీరో, డైరెక్టర్ కలిస్తే చూడాలని వాళ్ల వాళ్ల అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబోలలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ జోడీ ఒకటి. గతంలో వీళ్లిద్దరి కలయికలో వచ్చిన 'సింహా', 'లెజెండ్' చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అవడమే దీనికి కారణం. సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌గా పేరొందిన వీళ్లిద్దరూ కలిసి చేసిన మరో చిత్రమే 'అఖండ'. ఇటీవలే విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీనికి ఆరంభం నుంచే కలెక్షన్లు వెల్లువెత్తాయి. మరి 'అఖండ' పదకొండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం పదండి!

    ‘అఖండ’గా మారిపోయిన బాలకృష్ణ

    ‘అఖండ’గా మారిపోయిన బాలకృష్ణ

    రెండు భారీ విజయాల తర్వాత నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన చిత్రమే 'అఖండ'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇది డిసెంబర్ 2న రిలీజ్ అయింది.

    Bigg Boss Winner: తొలిరోజు షాకింగ్ ఓటింగ్.. టాప్‌లో ఆ కంటెస్టెంట్.. ఇదే కంటిన్యూ అయితే అతడే విన్నర్Bigg Boss Winner: తొలిరోజు షాకింగ్ ఓటింగ్.. టాప్‌లో ఆ కంటెస్టెంట్.. ఇదే కంటిన్యూ అయితే అతడే విన్నర్

    బాలయ్య కెరీర్‌లోనే రెండో అత్యధికం

    బాలయ్య కెరీర్‌లోనే రెండో అత్యధికం

    నటసింహం బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనికితోడు బోయపాటి శ్రీనుతో చేసిన సినిమా కావడంతో 'అఖండ'కు భారీ స్థాయిలో రూ. 53 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది బాలయ్య కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్. ఈ మూవీ రేంజ్‌ను బట్టే దీన్ని ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేశారు.

    11వ రోజు ఎక్కడ.. ఎంత రాబట్టింది?

    11వ రోజు ఎక్కడ.. ఎంత రాబట్టింది?

    అఖండకు తెలుగు రాష్ట్రాల్లో 11వ రోజు కలెక్షన్లు భారీగా పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 91 లక్షలు, సీడెడ్‌లో రూ. 76 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 35 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 23 లక్షలు, గుంటూరులో రూ. 25 లక్షలు, కృష్ణాలో రూ. 21 లక్షలు, నెల్లూరులో రూ. 15 లక్షలతో.. 11వ రూ. 3.05 కోట్లు షేర్, రూ. 5.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

    Disha Patani: దారుణమైన సెల్ఫీతో షాకిచ్చిన హీరోయిన్.. ఏకంగా షార్ట్‌ను కిందకు జరిపి మరీ!Disha Patani: దారుణమైన సెల్ఫీతో షాకిచ్చిన హీరోయిన్.. ఏకంగా షార్ట్‌ను కిందకు జరిపి మరీ!

    11 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

    11 రోజులకు కలిపి ఎంత వచ్చింది?


    'అఖండ' మూవీకి 11 రోజులకు కలిపి భారీ వసూళ్లు వచ్చాయి. నైజాంలో రూ. 17.47 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.51 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.43 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.68 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3 కోట్లు, గుంటూరులో రూ. 4.28 కోట్లు, కృష్ణాలో రూ. 3.22 కోట్లు, నెల్లూరులో రూ. 2.31 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 52.90 కోట్లు షేర్, రూ. 86.35 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటిన 'అఖండ'.. మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ఏపీ, తెలంగాణలో 11 రోజులకు కలిపి రూ. 52.90 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.92 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 61.97 కోట్లు షేర్, రూ. 105.80 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

    Bigg Boss: షణ్ముఖ్‌కు మరో దెబ్బ.. శ్రీరామ్ ఫ్యాన్స్ ఓట్లు ఆ కంటెస్టెంట్‌కు.. మరింత పడిపోయిన ర్యాంక్Bigg Boss: షణ్ముఖ్‌కు మరో దెబ్బ.. శ్రీరామ్ ఫ్యాన్స్ ఓట్లు ఆ కంటెస్టెంట్‌కు.. మరింత పడిపోయిన ర్యాంక్

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభాలు ఎంత?

    క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 54 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా పదకొండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 61.97 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 7.97 కోట్లు లాభాలను కూడా అందుకుంది.

    Recommended Video

    Siri Hanmanth : ఆదర్శంగా నిలిచిన Bigg Boss బ్యూటీ.. పెళ్లి కాకుండానే తల్లిగా || Filmibeat Telugu
    టాలీవుడ్‌లో రెండో స్థానానికి అఖండ

    టాలీవుడ్‌లో రెండో స్థానానికి అఖండ


    'అఖండ' సినిమాకు 11వ రోజు అన్ని ప్రాంతాల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం రూ. 3.05 కోట్లు వసూలు చేసింది. తద్వారా 11వ రోజు ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన రెండో చిత్రం (నాన్ బాహుబలి)గా నిలిచింది. దీనికంటే ముందు మహర్షి మూవీ రూ. 3.22 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. సైరా రూ. 2.73 కోట్లతో మూడో స్థానంలో ఉంది.

    English summary
    Nandamuri Balakrishna Did Akhanda Movie Under Boyapati Srinu Direction. This Movie Collect Rs 61.97 Crore in 11 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X