twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Veera Simha Reddy 1st Day Collections: బాలకృష్ణ కెరీర్ బిగ్గెస్ట్ ఒపెనింగ్స్ పక్కా.. ఆ రేంజ్ లో కలెక్షన్స్!

    |

    నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన గ్రాండ్ గా విడుదలైంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ అందుకోబోతున్నట్లు విడుదలకు రెండు రోజుల అర్థమయిపోయింది. క్రాక్ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన సినిమా కావడంతో అన్ని వర్గాలు ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకోబోతోంది అనే వివరాల్లోకి వెళితే..

    భారీ స్థాయిలో స్టార్ క్యాస్ట్

    భారీ స్థాయిలో స్టార్ క్యాస్ట్

    మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో నిర్మించిన వీర సింహారెడ్డి సినిమా కోసం ఆడియన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. అఖండ సినిమా తర్వాత బాలయ్య చేసిన సినిమా కావడం అలాగే క్రాక్ సినిమా తరువాత గోపీచంద్ మలినేని ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో ఆడియన్స్ లో అయితే అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని దాటేస్తాయి. దానికి తోడు శృతిహాసన్ వరలక్ష్మి శరత్ కుమార్, హాని రోజ్ దునియా విజయ్ ఇలా చాలామంది స్టార్ క్యాస్ట్ ఉండడంతో సినిమాకు మంచి ఓపెనింగ్స్ అయితే అందినట్లు తెలుస్తోంది.

     థియేటర్స్ కౌంట్

    థియేటర్స్ కౌంట్

    ఇక నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక థియేటర్లలో విడుదలైన సినిమాల్లో వీరసింహారెడ్డి ఒకటిగా నిలిచింది ఇక ఈ సినిమా నైజాం ఏరియాలో 265 కు పైగా థియేటర్లలో విడుదలవుతుండగా ఆంధ్ర మొత్తంలో 410 థియేటర్లలో విడుదలైంది. ఇక ఏపీ తెలంగాణలో మొత్తం 875 థియేటర్లలో అలాగే కర్ణాటక రెస్టాఫ్ ఇండియాలో 90 థియేటర్లలో ఓవర్సీస్ లో 500 కు పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే విరసింహారెడ్డి మొదటిరోజు థియేటర్ల సంఖ్య 1465 చేరినట్లుగా తెలుస్తోంది.

     సాలీడ్ బిజినెస్

    సాలీడ్ బిజినెస్

    ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చేసిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే ఈ విధంగా ఉన్నాయి. నైజంలో 15 కోట్లు, సిడెడ్ లో 13 కోట్లు, ఉత్తరాంధ్రలో 9 కోట్లు, ఈస్ట్ లో 5 కోట్లు, వెస్ట్ లో 5 కోట్లు గుంటూరులో 6.40 కోట్లు, కృష్ణలో 5 కోట్లు, నెల్లూరులో 2.7 కోట్లు, ఇక ఏపీ తెలంగాణలో మొత్తంగా 61.30 కోట్ల రేంజ్ లో ఈ సినిమా బిజినెస్ చేసింది. కర్ణాటకలో 4.50 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఒక కోటి ఓవర్సీస్ లో 6.2 కోట్లతో కలుపుకొని వరల్డ్ వైడ్ గా 73 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం.

    అడ్వాన్స్ బుకింగ్స్

    అడ్వాన్స్ బుకింగ్స్

    మొదటి రోజు ఊహించని స్థాయిలో ఒపెనింగ్స్ వచ్చాయి. ఆ విషయం హడావిడి చూస్తేనే అర్థమయింది. ముఖ్యంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమాకు సాలీడ్ కలెక్షన్స్ వచ్చాయి. అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే మొదటిరోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5 నుంచి 6 కోట్ల మధ్యలో కలెక్షన్స్ అందుకున్నట్లుగా తెలిసింది.

     థియేటర్ ఆక్యుపెన్సి

    థియేటర్ ఆక్యుపెన్సి

    వీర సింహారెడ్డి మొదటిరోజు మంచి థియేటర్ ఆక్యుపెన్సి ని కూడా నమోదు చేసుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ వరంగల్ గుంటూరు ఏరియాలలో దాదాపు 90 శాతానికి పైగా థియేటర్స్ ని నమోదు చేయడం విశేషం. అలాగే బెంగళూరు చెన్నై నగరాల్లో కూడా వీరసింహారెడ్డి సినిమా 50కి పైగా థియేటర్ ఆక్యుపెన్సీ ని సొంతం చేసుకుంది.

    మొదటి రోజు ఇండియా కలెక్షన్స్

    మొదటి రోజు ఇండియా కలెక్షన్స్

    వీర సింహారెడ్డికి టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ దక్కే అవకాశం ఉన్నట్లుగా అనిపిస్తుంది. మొత్తంగా ప్రస్తుతం అందిన లెక్కల ప్రకారం అయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా మొత్తంలో 25 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ సొంతం చేసుకునే అవకాశం ఉన్నట్లుగా బాక్సాఫీస్ పండితులు అంచనా వేస్తున్నారు.

    వరల్డ్ వైడ్ ఎంత రావచ్చంటే?

    వరల్డ్ వైడ్ ఎంత రావచ్చంటే?

    అలాగే వీర సింహారెడ్డి సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా గట్టిగానే రాబోతున్నట్లు అనిపిస్తుంది. ప్రీమియర్ షోలకే ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక యూఎస్ అలాగే ఓవర్సీస్ అన్ని ఏరియాలలో కలుపుకొని ఈ సినిమా అక్కడ కూడా 5 నుంచి 6 కోట్ల మధ్యలో కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉందట. అంటే వరల్డ్ వైడ్ గా వీరసింహారెడ్డి మొదటిరోజు 50 కోట్ల మేర కలెక్షన్స్ సొంతం చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

    English summary
    Nandamuri balakrishna Veera simha reddy day 1 world wide box office collections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X